చాలా మంది ఇళ్లల్లో మొక్కల్ని పెంచడానికి ఇష్ట పడుతూ ఉంటారు. మొక్కలు పెంచడం వల్ల అందంగా ఉండడమే కాకుండా మనకి కూడా ఎంతో తృప్తిగా, ఆనందంగా ఉంటుంది. అయితే మొక్కలు పెంచడం ఇష్టం అని మీకు నచ్చిన మొక్కలు అన్నిటిని పెంచేయద్దు. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం. అలానే ఇవి శుభాన్ని కలిగించవు. అయితే మరి ఎటువంటి మొక్కలు ఇంట్లో ఉండకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.
పాలు కారే మొక్కలు
ఇంట్లో పాలుకారే మొక్కలు ఉంటే అవి దురదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. వాస్తు ప్రకారం అవి ఇంట్లో ఉండకూడదు. తెల్లజిల్లేడు వంటి పాలు కారే మొక్కలు ఇంట్లో అసలు ఉంచుకోకండి. ఇవి దురదృష్టాన్ని తీసుకు వస్తాయి. కనుక నాటొద్దు.
బోన్సాయ్ మొక్కలు
బోన్సాయ్ మొక్కలు పెంచడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు. ఇవి అశుభకరమైనవి కాబట్టి ఇలాంటి మొక్కలు కూడా ఇంట్లో ఉంచొద్దు.
పత్తి మొక్కలు
అదే విధంగా ఇంట్లో పత్తి మొక్కలు ఉండడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కూడా అశుభానికి కారణమవుతాయి కాబట్టి వీటిని కూడా ఇంట్లో ఉంచకండి.
ముళ్ల మొక్కలు
ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉండడం వల్ల కూడా సమస్యలు కలుగుతాయి. ఈ మొక్కలు ఉండడం వల్ల దురదృష్టం ని తీసుకొస్తాయి కాబట్టి ముళ్ల మొక్కలు అయిన కాక్టస్ మొక్కలు వంటి వాటిని పెంచకండి. వీటి వలన ఒత్తిడి ఆందోళన కూడా కలుగుతాయి కాబట్టి ఈ మొక్కలు ఇంట్లో ఉంచకండి. ఉంచారంటే సమస్యలు తప్పవు.