శత్రుబాధలు పోవాలంటే దక్షిణ బద్రీనాథ్ సందర్శించండి !

-

నారసింహ అవతారం అంటేనే అత్యంత శక్తివంతమైన అవతారం. నరుడు కాక, జంతువు కాక రెండురూపాల కలయికతో ఏర్పడి భక్తసంరక్షణ చేసిన అద్భుత అవతారం నారసింహ. ఈ అవతారంలో అనేక మూర్తులు ఉన్నాయి. ఆయా రూపాలను పూజిస్తే రకరకాల ఫలాలు వస్తాయి అనేది సత్యం. అలాంటివాటిలో శత్రుబాధల నుంచి విముక్తి, రోగాల నుంచి అర్యోగం, భోగం, ఐశ్వర్యం ఇచ్చే నారసింహ ఆలయం మేల్కోటేలో ఉంది. దక్షిణ బద్రీనాథ్గా పేరుగాంచిన ఈ ఆలయ విశేషాలు, ఎక్కడుంది, ఎలా వెళ్లాలి అనేవి తెలుసుకుందాం…

కర్ణాటక లోని మండ్య జిల్లాలో పాండవపురం తాలూకాలో మేల్కొటే క్షేత్రం కలదు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ కృష్ణ దేవాలయం ఉన్నది. ఇందులోని విగ్రహాన్ని శ్రీ రామానుజుడు ప్రతిష్టించారని ప్రశస్తి. ఇక్కడ స్వామి వారిని ‘ చల్ల పిళ్ళ రాయుడు’ అంటారు. మైసూరుకు యాభై కిలోమీటర్ల దూరంలో ఈ చిన్న గ్రామముంది. ఇంకా చెప్పాలంటే టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం, బృందావన్ గార్డెన్స్ దాటుకుని వెళితే జక్కనహళ్ళి వస్తుంది. అవును అమర శిల్పి జక్కన ఊరే. ఈ ఊరికి ఐదారు కిలోమీటర్ల దూరంలో మేల్కోటే ఉంది. చాలా మందికి మేల్కోటే అంటే 12వ శతాబద్దపు చెలువ రాయుని దేవాలయం. యువ తరానికయితే ‘నరసింహ’ సినిమాలో రెండు పెద్ద స్తంభాల మధ్య రజనీకాంత్ కూర్చొన్న దృశ్యం చిత్రీకరించిన స్థలం. తెలుగు టీవీ, సినిమా ప్రేక్షకులకు అయితే మేల్కోటే ఒక నటుడు. కానీ తెలిసిన వారికి ఇది దక్షిణాది బద్రినాథ్.

పురాణ గాధ ప్రకారం

ఇక మేల్కోటే దేవాలయం గురించి చెప్పాలంటే కర్ణాటక రాష్ట్రంలోని తీర్థయాత్రా క్షేత్రాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ విష్ణువుదేవాలయాన్ని యోగనరసింహ స్వామికి అంకితం చేయబడినది. ఈ అద్భుతమైన ఆలయం యదుగిరి శిఖరంపై ఉంది. ఈ పవిత్రమైన ప్రదేశఆన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తుంటారు. ఆధ్యాత్మికపరమైన క్షేత్రం, చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణంలో ఆలయ నిర్మాణం జరిగి ఉండటం వల్ల ఈ మేల్కొటే ఇటు ఆధ్యాత్మిక పరంగా, అటు పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. నరసింహ స్వామి పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది నరసింహ స్వామి పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని హిరణ్యకశపుడు కుమారుడైన ప్రహ్లాదుడు చేత నిర్మించారని ప్రతీతి. హిరణ్యకశపుడును సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో అవతరించిన విషయం తెలిసిందే.

పద్మపీఠంపై నరసింహస్వామి

నరసింహస్వామి వారు పద్మపీఠంపై రెండు కాళ్లను కత్తెర వలె ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు శరంలో సగభాగం సింహ రూపంతో, సగభాగం మనిషి రూపంలో దర్శనమిచ్చే ఈ నరసింహస్వామి వారు పద్మపీఠంపై రెండు కాళ్లను కత్తెర వలె ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు. ఈ ఆసనాన్ని యోగాసనం అంటారు. యోగ రూపంలో దర్శనమిచ్చే దేవతలు ఈ ఆసనం లోనే ఉంటారు.

మూర్తి స్ఫటికకాంతి గల శరీరంతో రెండు మోకాళ్లకు యోగపట్టిక వేసి ఉంటుంది. స్వామివారి రెండు చేతులు ముందుకు చాచి రెండు మోకాళ్లపై ఉంటాయి. వెనుక చేతులలో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి ఉంటాడు ఈ స్వామి వారిని కేవల నరసింహమూర్తి, గిరిజ నరసింహమూర్తి అని కూడా అంటారు పర్వతాలపై, గుహలలో ఇటువంటి రూపం మనకు దర్శనమిస్తుంది. వైఖానసాగమం ఈ మూర్తి స్ఫటికకాంతి గల శరీరంతో ఉంటాడని చెప్పింది.

వైశాఖంలో స్వామి జయంతి !

ఈ స్వామికి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నసింహ జయంతి ఈ స్వామికి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధపారాయణలు అందుకుంటాడు. ఈ స్వామికి మరో విశేషం అన్ని దేవాలయాల వలే ఇక్కడ ఉత్సవ విగ్రహం ఉండదు. కేవలం స్వామి మూర్తిమాత్రమే ఉండటం మరో విశేషం.
యోగనరసింహస్వామివారిని దర్శిస్తే శతృబాధలుండవనీ, శాంతి, పుష్టి, జయం, ఆరోగ్యం, భోగం, ఐశ్వర్యాలు కలుగుతాయని వైష్ణవాగమాలు చెబుతున్నాయి.

ఎవరు నిర్మించారు ?

ఈ ఆలయం హొయసల కాలంలో నిర్మించబడింది ఈ ఆలయం హొయసల కాలంలో నిర్మించబడింది. మైసూర్ పాలకుడు అయిన టిప్పు సుల్తాన్ తప్ప ఏఒక్కరూ భారీగా విరాళాలు ఇచ్చిన దాఖలాలు లేవు. 1785 లో ఆయన ఆలయానికి ఏనుగులను సమర్పించారు. ఈ ఆలయ గంటను మైసూర్ పరకాళామాత విరాళంగా ఇచ్చింది. ఈ ఆలయానికి బారీగా విరాళాలు ఇచ్చినది మైసూర్ పాలకులు. మేల్కొటే శ్రీవిష్ణవ భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం మేల్కొటే శ్రీవిష్ణవ భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఎందుకంటే 12 వ శతాబ్ద ప్రారంభంలో, ప్రసిద్ధ అద్వైత తత్వవేత్త మరియు తమిళనాడు నుండి ప్రశంసించిన శ్రీ రామనుజాచార్య మెలకోట్లో 12 సంవత్సరాలు నివసించాడు.

మేల్కొటే ఎలా చేరుకోవాలి ?

మేల్కొటే కు సమీపాన 180 km ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. మండ్య సమీప రైల్వే స్టేషన్. ఇది మేల్కొటే నుండి 55 km ల దూరంలో ఉన్నది. బెంగళూరు, మండ్య, మైసూర్ తదితర ప్రాంతాల నుండి మేల్కొటే కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news