శ్రీ హనుమాన్ జయంతి : హనుమంతుడు ఎక్కడ ఉంటాడో తెలుసా ?

-

కలియుగంలో శ్రీఘ్రంగా ప్రత్యక్షం అయ్యే దేవుళ్లలో హనుమంతుడు ముఖ్యుడు. అయితే ఆయన ఎక్కడెక్కడ ఉంటాడో తెలుసుకుందాం.. హనుమత్‌ భక్తులకు అత్యంత ప్రామాణికమైన పారాయణం హనుమాన్‌ చాలీసా దానిని ప్రామాణికంగా తీసుకుని పరిశీలిస్తే…

యత్రయత్ర రఘునాథ కీర్తనం – తత్ర తత్ర కృతమస్తాకాంజలిం!
బాష్పవారి పరిపూర్ణలోచనం – మారుతిం నమత రాక్షసాంతకం !!


దీని అర్థం తెలుసుకుందాం… శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను. అంటే ఏ ఇంటిలో లేదా ప్రాంతం లేదా దేవాలయం లేదా మందిరాలలో ఎక్కడ రామనామ కీర్తన జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. అంటే మీ ఇంట్లో మీరు రామనామ కీర్తన చేస్తే తప్పక ఆయన ఏదో రూపంలో వచ్చి మీ చెంత కూర్చుంటాడు. ఇది గతంలో అనేక పర్యాయాలు రుజువైందని పలువురు హనుమత్‌ భక్తులు గ్రంథస్తం చేశారు. ఇక ఆలస్యమెందుకు హనుమంతుడి జయంతి రోజున ఆస్వామి స్వామి అయిన రామనామాన్ని జపించండి. ఆంజనేయుడి అనుగ్రహాన్ని పొందండి.

ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు అని పలువురు భక్తులు విశ్వసిస్తారు. ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనందభాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. అందరు రాకముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news