పితృదోషాలు ఉన్నాయా లేవా ఇలా తెలుసుకోవచ్చు!!

-

మానవులకు రకరకాల బాధలు. వాటిలో నవగ్రహ బాధలు, ఈతి బాధలు, నరఘోషలు రకరకాల సమస్యలు. వాటిలో ప్రధానమైనది పితృదోషాలు. వీటినే పైశాచిక బాధలుగా పిలుస్తారు. అవి జాతకం ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం.. జన్మకుండలిలో పంచమ భావములో శుక్రుడు, శని, రాహువు లేదా ఈ మూడు గ్రహాలలో ఏ రెండు గ్రహాలు అయినా ఉంటే, రవి పాపగ్రహముగా మారి, ఆ పైశాచిక ప్రభావాలు జాతకునిపై ఉంటాయి. జన్మకుండలిలో 4వ భావంలో కేతువు ఉంటే, చంద్ర గ్రహం యొక్క పైశాచిక ప్రభావములు ఎదుర్కొంటాడు.

బుధుడు (లేదా) కేతువు (లేదా) బుధ, కేతు కలసి లగ్నంలో గాని, వ భావంలో గాని ఉంటే, జాతకుడు కుజుడి పైశాచిక ప్రభావాల ఫలితాలు అనుభవిస్తాడు. జన్మకుండలిలో చంద్రుడు 3, 6వ భావంలో ఉంటే, జాతకుడు బుధుని పైశాచిక ప్రభావాలు ఎదుర్కొంటాడు. శుక్రుడు, బుధుడు లేదా రాహువు ఈ 3 గ్రహాలలో ఏ రెండు గ్రహాలు గాని, లేదా మూడు గ్రహాలు 2, 5 ,9,12వ భావంలో ఉంటే ఆ జాతకుడు గురువు వలన తీవ్రమైన వ్యతిరేక ఫలితాలు అనుభవిస్తాడు. జాతకంలో రవి లేదా చంద్రుడు లేదా రాహువు లేదా ఏ రెండు గ్రహాలు లేదా ఈ మూడు గ్రహములు కలసి 7వ భావములో ఉన్నట్లైతే జాతకుడు శుక్రుడు కలిగించే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తాడు.

రవి, చంద్ర లేదా కుజుడు లేదా వీటిలో ఏ రెడ్ను గ్రహాలు లేదా ఈ మూడు గ్రహాలు కలసి 10వ భావంలో లేదా 11వ భావంలో ఉంటే, ఆ జాతకుడు శని వలన విపరీతమైన చెడు ఫలితాలు అనుభవిస్తాడు. రవి లేదా శుక్రుడు లేదా ఇద్దరు 12వ భావంలో ఉంటే, జాతకుడు రాహువుకు సంబంధించిన వ్యతిరేక ఫలితములను అనుభవిస్తాడు. ఇలా ఆయా గ్రహాలు ఉన్నస్థానాలను బట్టి పితృదోషాలను తెలుసుకోవచ్చు. వీటి నివారణ కోసం పండితులను సంప్రదించి నివారణ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news