బాబుకు రోజూ క్లాస్ పీకుతోన్న వైసీపీ మంత్రి

-

ఏపీలో అధికార వైసీపీకి చెందిన ఓ మంత్రి ప్ర‌తి రోజు టీడీపీ అధినేత చంద్ర‌బాబును ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఏకేస్తున్నారు. స‌ద‌రు మంత్రి దాదాపుగా ప్ర‌తి రోజు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం విశేషం. ఇంత‌కు ఆ మంత్రి ఎవ‌రో కాదు పేర్ని నాని. త‌న వ‌రుస ప్రెస్ మీట్ల ప‌రంప‌ర‌లో శుక్ర‌వారం మ‌రోసారి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. గ‌త అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నికల ముందు మోదీని సర్వనాశనం చేయాలని చంద్రబాబు కంక‌ణం క‌ట్టుకున్నార‌ని అన్నారు.

మోదీని నాశ‌నం చేయాల‌ని కాంగ్రెస్ అధినేత‌లైన‌ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, తృణ‌మూల్ అధినేత‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డిఎంకే అధినేత‌ స్టాలిన్, బీజేడీ నేత‌ కుమారస్వామి వంటి నేతలతో అంటకాగిన చంద్రబాబు అంట‌కాగార‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌లు అయిపోయి.. ఎన్నిక‌ల్లో చావుదెబ్బ తిన్న త‌రువాత ఇప్పుడు వాళ్ల ఊసే ఎత్తడంలేదని అన్నారు. గ‌త‌ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాక‌పోవ‌డంతో చంద్ర‌బాబు వాళ్లలో ఏ ఒక్కర్నీ మళ్లీ కలిసిన పాపానపోలేదని విమర్శించారు.

ఒకవేళ ఆ నేతలు ఎయిర్ పోర్టులో కనిపించినా చంద్రబాబు ముఖం తిప్పుకుని వెళ్లిపోతున్నారని, ఆయన జీవితం అంతా యూటర్న్ లేనని వ్యాఖ్యానించారు మంత్రి పేర్ని నాని. ఆనాడు బీజేపీ పార్టీతోనే న‌ష్ట‌పోయామ‌ని, బీజేపీ నేతలను త‌న తిట్ల‌తో తూర్పార‌బ‌ట్టిన చంద్ర‌బాబు ఇప్పుడు మళ్లీ మోదీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీని వదులుకుని మనం చాలా తప్పు చేశామని వైజాగ్ లో టీడీపీ కార్యకర్తలతో చెబుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. బీజేపీ చీఫ్ అమిత్ షాను చంద్ర‌బాబు తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టార‌ని అన్నారు. అయితే మొన్నఅమిత్ షా పుట్టినరోజు సందర్భంగా తండ్రీ చంద్ర‌బాబు, కొడుకు లోకేష్ బాబు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీలు పడ్డారని నాని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు తన వద్ద ఉన్నదాన్ని పుత్తడి అని, వేరే వాళ్ల వద్ద ఉంటే ఇత్తడి అంటారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా జుగుప్సాకరమని పేర్కొన్నారు. చంద్ర‌బాబు నాయుడు చేసే రాజ‌కీయం అంతా అస‌హ్యంగా ఉంటుందని విమ‌ర్శించారు నాని. ఆయ‌న చేసిన పాల‌నంతా చీక‌టి పాల‌న‌ని, అక్ర‌మాల పాల‌న‌ని అన్నారు. చంద్ర‌బాబు ప‌రిపాల‌న న‌చ్చ‌ని ఏపీ ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తే, బుద్ది తెచ్చుకోకుండా సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్న‌డ‌ని అన్నారు. చంద్ర‌బాబు విమ‌ర్శ‌ల్లో ప‌స‌లేద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news