శుక్రవారం నాడు లక్ష్మి దేవి కటాక్షం కావాలంటే ఈ విధంగా చెయ్యాలి..

-

శుక్రవారం అంటే లక్ష్మీ దేవి అంటారు.. అందుకే ఆ ఆరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు.. అయితే అమ్మవారికి కఠినమైన పూజలు చేస్తే గానీ అమ్మవారి అనుగ్రహం మనమీద ఉండదు.. గరుడు పురాణం ప్రకారం..లక్ష్మీ దేవిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎప్పుడూ కూడా సంపద చూసుకొని గర్వపడకూడదు. డబ్బున్న వాళ్ళమని ఇతరులను ఎప్పటికీ కూడా అవమానించకూడదు. అలాగే వారిని అగౌరవపరచకూడదు. అంతేకాకుండా సంపద చూసుకొని గర్వపడే వారిపై లక్ష్మీదేవి కోపంతో వెళ్లిపోతుంది. అందుకే లక్ష్మీ అనుగ్రహం లేకుండా రూపాయి నిలవడం చాలా కష్టం. అందుకే డబ్బు ఉందని అహంకారం అస్సలు పనికిరాదు. డబ్బు గర్వంతో ఇతరులను కించపరచడం అస్సలు మంచిది కాదు. ఇక ఇంట్లో తరచుగా రామాయణం,మహా భారతం వంటివి నిరంతరం పారాయణం చేస్తే ఆ ఇంట్లో ఇప్పటికి ఆనందం, శాంతి వెళ్లి విరుస్తాయి..

వ్యక్తి శక్తి కొద్ది ధాన ధర్మాలు చెయ్యాలి..అయితే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, అవసరం ఉన్నవారికి చేతి సాయం చేయడం లాంటివి చేయడం వలన పుణ్యం కలుగుతుంది. ఫలితంగా అనుకున్నవి సాధించగలుగుతారు. దీని వల్ల లక్ష్మీ కటాక్షం కూడా దొరుకుతుంది. గరుడ పురాణాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా పితృదేవతలను ఆరాధించుకోవాలి. అందుకే తెల్లవారుజామున నిద్ర లేచి స్నానది కార్యక్రమాలు చేసి ఆ తర్వాత దేవుళ్లను పూజించాలి అని గరుడ పురాణం చెబుతోంది. వంటగది చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. అందుకే వంటగదిలోకి ఉదయం స్నానం తర్వాతే వంట చేసేందుకు ప్రవేశించాలి. వంట గదిలో వండిన ప్రతి వంటకం భగవంతుడికి సమర్పించిన తర్వాతే ప్రసాదంగా మనం స్వీకరించాలి.. అప్పుడే అమ్మవారు ఆ ఇంటిని వదిలిపెట్టదు..

Read more RELATED
Recommended to you

Latest news