మంగళవారం నాడు హనుమంతుడిని పూజించడం చాలా మంచిది. పూజ చేసి ఆ తర్వాత హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అయితే కేవలం మంగళవారం నాడు మాత్రమే కాకుండా ప్రతి రోజు కూడా మీరు చదువుకోవచ్చు. అయితే హనుమాన్ చాలీసా చదువుకునేటప్పుడు ఇవి మాత్రం మర్చిపోకండి.
- మీరు ఎప్పుడైతే హనుమాన్ చాలీసా చదువుతారో అప్పుడు హనుమంతుడు ఫోటో పెట్టినప్పుడు తప్పకుండా రాముడు హనుమంతుడు కలిసి ఉన్న ఫోటోలు మాత్రమే పెట్టండి.
- హనుమాన్ చాలీసా చదివే ముందు ఒక రాగి పాత్ర లేదా ఇతర ఏ పాత్రలోనైనా నీళ్లు వేసి ఆ నీళ్ళని హనుమంతుడు మీద జల్లిన తర్వాత అప్పుడు చాలీసా చదవడం ప్రారంభించండి.
- అలానే హనుమంతుడి ముందు దీపం కూడా వెలిగించాలి.
- హనుమాన్ చాలీసా మీరు మంగళవారం లేదా శనివారం కూడా చదువుకోవచ్చు.
- మామూలుగా ఎలా పూజ చేసుకుంటాము అంటే శుభ్రంగా స్నానం చేసి ఆ తర్వాత దేవుడికి పూజ ఎలా చేస్తామొ అలాగే హనుమాన్ చాలీసా కూడా చదవాలి. స్నానం చేయడం శుభ్రమైన దుస్తులు ధరించడం ఆ తర్వాత చాలా చదువుకోవడం మంచిది.
- ఎప్పుడైనా సరే మీరు పూజ చేసేటప్పుడు నేల మీద కూర్చోకండి. చాప లేదా ఏదైనా టవల్ కానీ కింద పరచి దాని మీద కూర్చోండి. ఈ విధంగా మీరు హనుమాన్ చాలీసా చదివితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి అని అంటున్నారు పండితులు.
సంకట మోచన హనుమాన్ ఆలయం విశేషాలు ….!