బరువు తగ్గాలన్నా ఆలోచన మనసులోకి రాగానే కార్బోహైడ్రేట్ల విషయం గుర్తుకు వస్తుంది. తక్కువ కార్బోహైడ్రేట్లు శరీరానికి మేలు చేస్తాయి. అందుకే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్లు గల బిస్కట్, బ్రెడ్, చక్కెర కలిగిన ఆహారాలను తీసుకోకపోవడమే మంచిది. పాలకూర, కాలీ ఫ్లవర్ మొదలగు వాటిల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అంతేకాదు ప్రోటీన్ ఎక్కువగా గల గుడ్లు, గింజలు, చేపలు మొదలగునవి తినాలి. ఇవి శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందిస్తాయి.
తక్కువ కార్బోహైడ్రేట్లు గల ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఇంకా డయాబెటిస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నా తగ్గే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అదీగాక జీవక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం బాగవుతుంది. శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా చూసుకుంటుంది. అంతే కాదు జీవించడమ్లో నాణ్యతను మరింత పెంచుతుంది. అందుకే ఈ తక్కువ కార్బోహైడ్రేట్లు గల డైట్ ని ఊబకాయం ఉన్నవారు ఖచ్చితంగా పాటించాలి.
ఊబకాయం వల్ల డయాబెటిస్ వచ్చి అక్కడ నుండి అనేక ఇతర వ్యాధులకు కారణం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆహారంలో ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండకుండా చూసుకోండి. మీరేంమ్ తింటున్నారో దాన్ని బట్టే మీ జీవితం ఉంటుందని అర్థం చేసుకోండి. అనవసరమైన ఆహారాలను ముట్టుకోకోకపోవడమే మంచిది.
ఈ డైట్ ని పాటించాలనుకునే వారు ఒక రోజులో కేవలం 50-100గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ డైట్ ప్రారంభించాలని అనుకునేవారు ముందుగా మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీ శరీరానికి ఏది మేలైనదో మీ వైద్యుడు మీకు సలహా ఇస్తారు.