కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలు…!

-

మన ప్రాచీన భారతావనిలో ఉన్న అష్టాదశ శక్తీపీటల్లో జగన్మాత కొలువై పూజలందుకుంటుంది. అయితే ఒక్కో ప్రదేశంలో ఒక్కోపేరుతో అమ్మవారు కొలువై ఉంది. అయితే కొల్హాపూర్ లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు అంబాదేవి గా విరాజిల్లుతుంది. ఈ ఆలయం మహారాష్ట్ర లోని కొల్హాపూర్ లో ఉంది. ఇది భారత దేశంలోనే ఒక ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతుంది. ఈ ఆలయం క్రి శ 7 వ శతాబ్దంలో చోళులు ద్వారా నిర్మించబడిందని చరిత్ర చెపుతుంది.

కొల్హాపూర్ లో వేంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి యొక్క విశేషం ఏమిటంటే ప్రతి రోజు సూర్య కిరణాలు ఈ విగ్రహానికి బంగారు సొగసులు అద్దే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక నవరాత్రి వంటి వేడుకలు చూడటానికి భక్తులు దేశం నలుమూలల నుండి అధిక సంఖ్యలో వస్తారు. ఆ సమయంలో ఈ ప్రాంతం అంతా ప్రకాశవంతమైన రంగులతో, మంచి సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది. హిందూ దేవాలయాల్లో విగ్రహాలు తూర్పు వైపు కో లేదా ఉత్తరం వైపు కో ఉంటాయి. కాని ఇక్కడ అమ్మవారి విగ్రహం మాత్రం పశ్చిమం వైపు కి తిరిగి ఉంటుంది.

పశ్చిమ వైపు గోడకు ఉన్న చిన్న కిటికీ ద్వారా సూర్యాస్తమయం సమయంలో సూర్య కిరణాలు మార్చ్ 21, సెప్టెంబర్ 21 లలో మూడు రోజుల పాటు సూర్య కిరణాలు విగ్రహం పై పడతాయి. ఈ ఆలయం విశాలమైన ప్రాంగణములో చుట్టూ ఎత్తైన ప్రహరీ మద్యలో ఉన్న ఆలయం ఒక అద్భుతమైన కళాసృష్టి అని చెప్పుకోవచ్చు. గుడి చుట్టూ శిల్పాలతో మనోహరంగా ఉంటుంది. మహారాస్ట్రియులకు కొల్హాపూర్ ఒక పవిత్ర పుణ్య క్షేత్రం. ఈ ఆలయ ప్రాంగణం లో విటోభా ఆలయం పురాతనమైనది. సూర్య గ్రహణం రోజున ఇక్కడ స్నానం చేస్తే పంచ మహా పాతకాలు పోతాయి అని భక్తుల నమ్మకం.

Read more RELATED
Recommended to you

Latest news