పవన్ కళ్యాణ్ పెద్ద మనసు, ఫోన్ చేసిన కేంద్ర మంత్రి…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన నేపధ్యంలో విదేశాల్లో మన విద్యార్ధులు, ఉద్యోగులు లక్షల మంది ఆగిపోయారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండలేరు, ఇక్కడికి రాలేరు. దీనితో ఒక్కసారిగా ఆందోళన మొదలయింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా విద్యార్ధులు అమెరికా సహా పలు దేశాల్లో ఉన్నారు. దీనితో ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

ఇక మన విద్యార్ధులు యుకెలో చిక్కుకోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కారణంగా యూకేలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్రానికి పవన్ విజ్ఞప్తి చేసారు. గురువారం ఉదయం భారతీయ విద్యార్థుల ఆందోళన విషయంలో ఆయన ట్విటర్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళడంతో…

కేంద్రం వెంటనే స్పందించింది గురువారం సాయంత్రం పవన్ కల్యాణ్‌తో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఫోన్ లో మాట్లాడి, యూకేలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు అవసరమైన ఆహార, వసతి సమకూరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. లండన్ లో ఉన్న హై కమిషన్ కార్యాలయ అధికారులు ఆ విద్యార్థులకు సహాయం అందిస్తారని, ఎవరూ ఆందోళన చెందవద్దని… వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news