ఏపీలో ఆ 8 ఆలయాల్లో ఇక నుంచి ఆన్​లైన్​ సేవలు

-

నేటి యుగమంతా ఆన్ లైన్, డిజిటల్ సేవలవైపే మొగ్గుచూపుతోంది. ఫుడ్ నుంచి వాడుకునే వస్తువుల వరకు అంతా ఆన్ లైనే. కస్టమర్ల సౌకర్యం మేరకు ఆయా సంస్థలు కూడా డోర్ డెలివరీలు, ఆన్ లైన్ సేవలవైపే మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు అందించే కొన్ని సేవలను ఆన్ లైన్ లో అందిస్తున్నాయి.

ఇందులో భాగంగానే ఏపీలో ఎనిమిది ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించనున్నట్టు ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. కాణిపాకం, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, అన్నవరం, పెనుగంచిప్రోలు, సింహాచలం, వాడపల్లి, అయినవిల్లి ఆలయాల్లో ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే మరో 10 ఆలయాల్లోనూ ఆన్‌లైన్‌ సేవలు కల్పించాలని భావిస్తున్నట్టు చెప్పారు.

అక్టోబర్‌ 10న ధార్మిక పరిషత్‌ తొలి సమావేశం జరుగుతుందని మంత్రి అన్నారు. ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని.. ఉచిత, రూ.300 దర్శనాలకు వచ్చేవారికి ఘాట్‌ రోడ్డు ద్వారా అనుమతించనున్నట్టు మంత్రి వెల్లడించారు. సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా వీఐపీల కోసం ప్రత్యేక టైం స్లాట్‌ని కేటాయిస్తున్నామనిచెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news