వాస్తు: ఆర్థిక సమస్యలతో ఇబ్బందిగా ఉందా? ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.

వాస్తు శాస్త్ర రీత్యా ఇంట్లో ఉండే ప్రతీ వస్తువుకి ఏదో అర్థం ఉంటుంది. ఏది ఎక్కడ ఉంచాలనే విషయంలో వాస్తు శాస్త్రం ఎలా చెబుతుందో ఏ మొక్క ఎలాంటి ఫలితాన్నిస్తుందో కూడా చెబుతుంది. అందుకే ఇంట్లో మొక్కలు పెంచే ప్రతీ ఒక్కరూ ఈ విషయాలను గమనించుకోవాలి. లేదంటే వాటివల్ల ఏర్పడే ఇబ్బందులకు గురి కావాల్సి ఉండవచ్చు. ముఖ్యంగా పెరట్లో మొక్కలు నాటేవారు ఎలాంటి మొక్కలు నాటాలి? ఆర్థిక ఇబ్బందులను దూరం చేయడానికి ఏ మొక్క కలిసివస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

వాస్తు/vastu

ఇంట్లో మొక్కల గురించి మాట్లాడితే మొదటగా చెప్పుకోవాల్సింది తులసి మొక్క గురించే. ప్రతీ ఇంట్లో తులసి మొక్క ఉండడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతుంది. తులసిలో ఎన్నో ఔషధాలున్నాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ఆరోగ్యకరమైన జీవితానికి, యాంగ్జయిటీని దూరం చేసుకోవడానికి ఇంట్లో తులసి మొక్క నాటండి. మీ ఇంట్లో మొక్క నాటడానికి స్థలం లేనట్టయితే పూలకుండీలో కూడా నాటుకోవచ్చు. అలాగే ఒత్తిడి నుండి బయటపడడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి బెడ్ రూమ్ లో లావెండర్ మొక్కను పెంచండి.

ఇంకా, ఆర్థిక పరమైన ఇబ్బందులు మీ దరి చేరవద్దు అనుకుంటే రోజ్ మేరీ, స్పైడర్ మొక్కలు నాటడం మంచిది. దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు ఆర్థికంగా వచ్చే ఇబ్బందులు రాకుండా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే మీ ఇంట్లోగానీ, పెరట్లోగానీ మొక్కలు నాటాలనుకునే ప్రతీ ఒక్కరూ ఎలాంటి మొక్కలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో తెలుసుకోండి. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఇలాంటి వాటి పట్ల నమ్మకంగా ఉంటారు. వాస్తు అనేది నమ్మకం కాబట్టి, ఎవరి నమ్మకాలు వారివి.