భక్తి: ఏ దేవుడికి ఏ పుష్పాలతో పూజిస్తే మంచిదో తెలుసా..?

-

సాధారణంగా మనం ప్రతీ రోజు దేవుడికి పుష్పాలని అర్పించి ఆరాధిస్తాము. కేవలం ఇళ్లల్లోనే కాదు దేవాలయాల్లో కూడా దేవుడికి పుష్పాలను, పుష్ప మాలలని అర్పిస్తాము. అయితే ఏ దేవుడిని ఏ పుష్పాల తో కొలిస్తే మంచిది..? ఏ దేవుడికి ఏ పుష్పాలు ఇష్టం అనేది మనం ఈరోజు చూద్దాం. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే… ఏ దేవుడికి ఏ పుష్పాలు ఇష్టం అంటే…? తెల్లజిల్లేడు పుష్పాల తో సూర్య భగవానుడ్ని, విఘ్నేశ్వరుని పూజించేస్తే చాల మంచిదట. అలానే విష్ణు భగవానుడిని తులసి దళాల తో, శ్రీ మహా లక్ష్మిని తామర పువ్వుల తో పూజించాలి.

divine flowers

అలానే గాయత్రి దేవిని పూజించినప్పుడు మల్లిక, పొగడ, కుశమంజరి, మందార, మాధవి, జిల్లేడు, కదంబ, పున్నాగ, చంపక, గరిక పుష్పాల తో పూజిస్తే చాల మంచి జరుగుతుందిట. అలానే ఎప్పుడైనా మీరు శ్రీ చక్రాన్ని పూజిస్తే అప్పుడు మీరు తప్పకుండ తులసి దళాలు, కలవ పూలు, జాజి, మల్లె, ఎర్ర గన్నేరు, ఎర్ర కలువ పూలు, గురువింద పుష్పాల తో పూజించాలి. ఇలా శ్రీ చక్రాన్ని ఈ పుష్పాల తో కనుక పూజ చేస్తే చాల మంచి మీకు జరుగుతుంది.

మహా శివుని కి మారేడు దళాల తో పూజించాలి. ఇలా మారేడు దళాల తో మహా శివునిని పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తిచెంది కోరిన వరాలని ఇస్తారు అని అంటారు. లేక పోతే పవళ మల్లె పుష్పాల తో పూజిస్తే కూడా మంచి కోరికలు , మంచి ఆలోచనలు ఉద్భవిస్తాయట. అలానే శ్రీ మహా లక్ష్మిని పూజించినప్పుడు ఆమెకి ఎంతో ప్రీతికరం అయిన ఎర్ర పుష్పాలు సమర్పించడం మంచిది. ఇలా చెయ్యడం వలన శ్రీ మహా లక్ష్మి సంతుష్టురాలై, అభీష్టసిద్ధినిస్తుంది అని అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news