శని శాంతించాలంటే ఏ పూజ చెయ్యాలి..? ఎలా చెయ్యాలి?

-

లోకంలో నిత్యం విన్పించే మాట శని పట్టింది. మా పరిస్థితి ఏం బాగులేదు. అనుకున్నవేవి కావట్లేదు. అందరు శని పూజ చేయమంటారు కానీ ఎలా చెయ్యాలి..? ఏం చెయ్యాలి అనేది తెలియదు. నిజానికి శనిదేవుడు దయార్ధ్ర హృదయుడని శాస్ర్తాలు చెపుతున్నాయి. అయితే వారివారి గ్రహస్థితులను బట్టి శని ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో చిన్నచిన్న పరిహారాలను పాటిస్తే శనిదేవుడు శాంతించడమే కాకుండా గొడ్డలితో పోయేదాన్ని గోటితో తీసేస్తాడు. ఆ పరిహారాలను చూద్దాం.. అయితే ఒక్క విషయం శాస్త్రవచనాలను నమ్మకంతో, విశ్వాసంతో ఆచరిస్తేనే ఫలితాలు కలుగుతాయి. విమర్శతో, మొక్కుబడిగా ఆచరిస్తే ఫలితాలు రావు.

– బ్రహ్మపురాణం 118వ అధ్యాయంలో శనిదేవుడు చెప్పిన వాక్యాలు నా రోజు అంటే శనివారం నాడు ఎవరైతే క్రమం తప్పకుండా రావిచెట్టును తాకుతారో వారి సర్వకార్యాలు నెరవేరుతాయి. నా నుంచి వారికి ఎటువంటి బాధలు కలుగవు. శనివారం వేకువజామున లేచి రావిచెట్టు ప్రదక్షిణలు లేదా స్పర్శిస్తారో వారికి గ్రహాల బాధలు కూడా రావు రావిచెట్టు వద్దకు వెళ్లినప్పుడు కలియుగదైవం వేంకటేశ్వరనామ స్మరణ చేయండి మరింత మంచి ఫలితం వస్తుంది. ఓం నమో వేంకటేశాయ.
ఆలస్యం ఎందుకు… ఇక ఆచరించండి. మంచి ఫలితాలను పొందండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news