తాజాగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకుని భవిష్యత్తులో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా కలసి పని చేయడానికి డిసైడ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో జాతీయ పార్టీతో పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తో చేతులు కలపడంతో ఫుల్ హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీని దుమ్ము దులిపేయవచ్చు అని అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ కి బీజేపీ పార్టీ పెద్దలు మెలిక పెట్టినట్లు ఢిల్లీలో మరియు బిజెపి పార్టీ లో వినపడుతున్న టాక్.
అసలు మేటర్ లోకి వెళ్తే రాబోయే సార్వత్రిక ఎన్నికలలోపు ఏ క్షణంలోనైనా జనసేన పార్టీ బిజెపి పార్టీలో విలీనం చేయాలని బిజెపి పార్టీ పెద్దలు నేతలు అమిత్ షా పవన్ కళ్యాణ్ కి సూపర్ మెలిక పెట్టినట్లు దీనికి ఒప్పుకుంటేనే ప్రస్తుతం బిజెపి పార్టీ తో కలిసి పని చేయాలన ఒప్పందం పవన్ దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం.
కనీసం పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీ బీజేపీ లో విలీనం అయితేనే రాబోయే రోజులు కలిసి పని చేయాలి అనే ఒప్పందం తీసుకురావడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫుల్ డైలమాలో పడిపోయినట్లు తన అన్న మాదిరిగానే తనకి కూడా రాజకీయంగా చెడ్డపేరు రాబోయే రోజుల్లో రాబోతున్నట్లు పవన్ ఫీల్ అవుతున్నట్లు సమాచారం.