భక్తి: శంఖాన్ని పూజిస్తే ఈ సమస్యలు వుండవు..!

మీ ఇంట్లో ఎక్కువగా బాధలు ఉన్నాయా..? వాటి నుండి బయట పడాలి అనుకుంటున్నారా..? అయితే పండితులు చెబుతున్న ఈ చిట్కాలు పాటించారంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న ఈ టిప్స్ కోసం ఇప్పుడే చూసేయండి.ఆర్ధిక సమస్యల నుండి బయట పడాలంటే ఇంట్లో శంఖాన్ని దక్షిణ దిక్కుకి ఉంచండి. దీని వల్ల లక్ష్మీదేవిని మీ ఇంట్లో ఉంటుంది. శంఖాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు ముందు దానిని శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే పెట్టండి.

ప్రతి రోజు లక్ష్మీ దేవిని పూజించడం తో పాటు లక్ష్మీదేవి పక్కన శంఖాన్ని ఉంచి దానిని కూడా పూజించండి. దీంతో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే పూర్తిగా దూరం అయిపోతాయి.

దక్షిణావర్తి శంఖం పూజించడం వల్ల మరింత ఉపయోగకరంగా ఉంటుంది. దక్షిణావర్తి శంఖం వల్ల కలిగే ఉపయోగాలు గురించి చూస్తే.

వ్యాపారంలో లాభాలు రావడానికి ఇది బాగా మేలు చేస్తుంది ఆర్థిక సమస్యలను పూర్తిగా దూరం చేస్తుంది. కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు పండితులు చెబుతున్న విధంగా పాటించడం మంచిది.

అదే విధంగా భార్య భర్తల మధ్యలో ఎక్కువగా గొడవలు వస్తుంటే.. బెడ్ రూమ్ లో శంఖంని బౌల్ లో పెట్టి ఉంచండి. దీనితో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోయి మంచి అన్యోన్యత ఏర్పడుతుంది.

అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే శంఖాన్ని పూజ చేసేటప్పుడు తులసి దళాలతో పూజ చేయండి దీంతో సమస్యలు ఉండవు.