భక్తి: ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది…!

ఇంట్లో ఈ తప్పులు చేయడం వల్ల మంచి కలగదని ఆర్థిక సమస్యలు వస్తాయని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీ ఇంట్లో ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. వీటిని కనుక అనుసరించారు అంటే ఆర్థిక సమస్యలు రాకుండా ఉండొచ్చు.

ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు:

ఉదయాన్నే ఎక్కువ సేపు నిద్ర పోవడం:

పురాణాల ప్రకారం సూర్యోదయం కంటే ముందు లేవడమే మంచిది. పొద్దు ఎక్కే వరకు నిద్ర పోవడం వల్ల మంచిది కాదని లక్ష్మీ దేవికి కోపం వస్తుందని… దీనితో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి సూర్యోదయం అవ్వక ముందే నిద్ర లేవడం మంచిది ఈ అలవాటుని అలవాటు చేసుకోవడం ఉత్తమం.

రాత్రిపూట గోళ్లు కొరకకూడదు:

చాలామందికి గోళ్ళు కొరికే చెడు అలవాటు ఉంటుంది. ఈ అలవాటు మంచిది కాదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గోళ్లు కొరకుతే శుభం జరగదు.

భోజనం మధ్యలో లేవడం:

చాలామంది అన్నం తింటూ మధ్య లో లేస్తూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదని అది అన్నపూర్ణాదేవి అవమానించడమేనని పండితులు చెబుతున్నారు. కాబట్టి అన్నం మధ్యలో లేవద్దు.

సాయంత్రం పూట ఉప్పునివ్వదు:

చాలామంది స్నేహితులు లేదా పక్కింటి వాళ్ళు ఇంటికి వచ్చి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అయితే ఒకవేళ సాయంత్రం వేళల్లో ఎవరైనా ఉప్పు కావాలని అడిగితే అసలు ఇవ్వదు. ఉప్పు ని ఇలా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

రాత్రిపూటే సామాన్లన్నీ శుభ్రం చేసుకోండి:

రాత్రి వండిన పాత్రల్ని, భోజనం చేసిన ప్లేట్స్ ని ఉదయం వరకు ఉంచకూడదు. రాత్రి సామాన్లు రాత్రి క్లీన్ చేసుకోవాలి. ఈ అలవాటు లేక పోతే అలవాటు చేసుకోండి.