గురు పౌర్ణమి ప్రాముఖ్యత.. ఈరోజు ఎటువంటి పనులు చేస్తే మంచిదో తెలుసా..?

-

తెలుగు నెలల ప్రకారం ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది..అలాగే ఎన్నో పండగలు కూడా వస్తాయి.కానీ ఆషాడమాసంలో వచ్చే పౌర్ణమికి ఓ ప్రత్యేక ఉంది. ఈ పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు, ఎందుకంటే మహాభారతాన్ని రచించిన వేద వ్యాస మహర్షి కూడా ఈ రోజునే జన్మించారని నమ్ముతారు. ఈ సందర్భంగా, ఈ రోజును గురు పూర్ణిమగా జరుపుకుంటారు. పూర్తి ఆచార, నియమాలతో వ్యాస భగవానుడిని పూజిస్తారు.

ఈ ఏడాది గురు పౌర్ణమి జూలై 13 వ తారీఖున వచ్చింది.బుధవారం వచ్చింది. గ్రహాలు, రాశుల ప్రకారం ఈ రోజు చాలా ముఖ్యమైనదని నమ్ముతారు. ఈ రోజున మీ జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును ఏ నియమాలను పాటించడం ద్వారా కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పూజకు ఏర్పాటు చేసుకోండి. ఈ రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి, తెల్లవారుజామున పూజలు చేయడంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూజాసామాగ్రి, పూలు, మాలలు, తాంబూలం, వంటి ఇతర పూజా వస్తువులను ఒక రోజు ముందుగానే ఏర్పాటు చేసుకోండి..మీ గురువు దగ్గరకు వెళ్ళి మీకు ఉన్నంతలో పూజ చేసి కానుక ఇవ్వండి..

ఈరోజు ఎటువంటి పనులు చేస్తే మంచిది..

ఈ రోజున కొన్ని పనులు చేయడం ద్వారా సంపదలకు దేవత అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. దీని కోసం, ఒక కుండలో మంచినీటిని తీసుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు..

అలాగే సాయంత్రం భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిండు చంద్రుని దర్శించి పూజ చేస్తె మంచిది.
పౌర్ణమి సాయంత్రం తులసి మొక్క ముందు స్వచ్ఛమైన దేశం నెయ్యి దీపం వెలిగించడం వలన అదృష్టం కలిగిస్తుంది..

ఇకపోతే పౌర్ణమి రోజున, వృద్ధులను లేదా స్త్రీని పొరపాటున కూడా అవమానించకూడదు. వాస్తవానికి, గురు పూర్ణిమ మీ పెద్దలను గౌరవించాలని మీకు బోధిస్తుంది..అలాగే ఈరోజు ఇంటికి వచ్చిన బిచ్చగాళ్ళను ఒట్టి చేతులతో పంపకండి..మీకు తోచినంత ఇచ్చి పంపడం చాలా మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news