దక్షిణభారత అమర్‌నాథ్.. ‘సలేశ్వరం’ ఎక్కడో మీకు తెలుసా!

165

  • సలేశ్వర లింగమయ్య క్షేత్రం
  •  ప్రకృతి ఒడిలో వెలిసిన దివ్యక్షేత్రం సలేశ్వరం
  •  ఈ నెల 17 నుంచి 21 వరకు ఉత్సవాలు
  • జైనులు, బుద్ధులు, శైవులు ఏలిన నేల
  • కాలినడకన మూడు కిలోమీటర్ల ప్రయాణం
  • 280 అడుగుల పైనుంచి జాలువారే జలపాతం

దేశంలోనే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధిచెందిన శైవక్షేత్రం అమర్‌నాథ్. అచ్చం అలానే ఎత్తైన గుట్టలు, లోతైన లోయల మధ్య వెలిసిన శైవక్షేత్రం దక్షిణ భారతదేశంలో సైతం ఒకటున్నదన్న విషయం చాలామందికి తెలియదు. కానీ మన నల్లమల అడువుల్లో శ్రీశైలానికి దగ్గర్లో ఉంది. సుమారు 300 అడుగుల ఎత్తునుంచి పరవళ్లుతొక్కే గంగమతల్లి,ఎత్తైన కొండల మధ్య వెలిసిన దివ్యక్షేత్రమే సలేశ్వరం. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో నల్లమల అడువుల్లో వెలిసిన పరమపవ్రిత, శక్తివంతమైన శైవ క్షేత్రం. అటు భక్తులను, ప్రకృతి ఆరాధకులను, సహసీకులను మైమరపించే క్షేత్రం సలేశ్వరం.

నల్లమల అడవుల్లో సాగించే ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరం.. ఎత్తైన కొండలు.. ఆ వెంటనే లోయలు.. పక్షుల కిలకిలరా-వాలు.. దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి. సలేశ్వరం ఉత్సవాలు ఏప్రిల్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. దారిపొడవునా అటవీ అందాలు, ప్రముఖ శైవ క్షేత్రాలు, కనువిందు చేసే జలపా-తాలు, అనేక రకాల వన్యప్రాణులు యాత్రికులను ఇట్టే కట్టిపడేస్తాయి. దాదాపు 35 కి.మీ. పొడవునా దట్ట-మైన అడవిలో సాగే యాత్రలో 3 కి.మీ. కాలినడకనే కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. దక్షిణభారత అమర్‌నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం సాహ-సయాత్ర విశేషాలు.

సలేశ్వరం ప్రత్యేకతలు

 

 నిజానికి ఈ క్షేత్రం ఎప్పటితో ఎవ్వరికి తెలియదు. పురాణ కాలం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్లు కథనాలు ఉన్నాయి. తపస్సు చేసుకునేవారికి ఇది అనువైన స్థలమని పలువురు పండితులు పేర్కొంటున్నారు. ఈ చుట్టు పక్కల అడువుల్లో, గుహల్లో ఎందరో తపం ఆచరిస్తుంటారని ప్రతీక. అయితే ఇక్కడి ఆదివాసీల కథనం ప్రకారం ఐదారు శతాబ్దాల క్రితం ఈ క్షేత్రాన్ని తమ పూర్వీకుల కనుగొన్నారని వారు చెపుతున్నారు. అపటినుంచి లింగమయ్య ఆలయంలో ఆదివాసీలే పూజారులు. సలేశ్వరంలో వెలసిన లింగమయ్య (లింగం)ను భక్తులు తాకినప్పుడు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. అందువల్లే కదిలే లింగమయ్యగా ఆది-వాసీ పెద్దలు చెబుతుంటారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమి ఆదివాసీలు ప్రత్యేక దినంగా భావిస్తుంటారు. పౌర్ణమి రోజు అర్ధరాత్రి ఆలయం ఎదుట ఉన్న గుండంలో చంద్రకాంతి పడటం వలన ఆ కాంతిలో పుణ్యస్నానాలు చేస్తే శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం.
– 280 అడుగులపైనుండి జాలువారే జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. అక్కనే మరో గుహలో శనేశ్వరుని ఆలయం చాళక్యులు, చోళులు, పాండ్యులు, జైన, బుద్ధ, వైష్ణవుల కాలంలో చెక్కిన రాతి విగ్రహాలు ఉన్నాయి.

READ ALSO  నరేష్ కు వార్నింగ్ ఇచ్చిన మహేష్

లింగాకారంలో గుండం

 

సలేశ్వరం వద్ద జాలువారే జలపాతం రెండు కొండల మధ్య సహజసిద్ధ్దంగా లింగాకారంలో గుండంగా ఏర్పడింది. దీని లోతు సుమారు వంద అడుగులు ఉన్నట్లు ఆదివాసీలు చెబుతారు. జలపాతం చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా తరలివస్తుంటారు.

280 అడుగులపై నుంచి జాలువారే జలపాతం

నల్లమల అటవీ మార్గంలో కాలినడకన చేరుకున్న భక్తులకు సుమారు 280 అడుగుల పైనుంచి జాలు-వారే జలపాతం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. అయితే జలపాతం ఎక్కడనుండి పారుతుందో ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కడం లేదు. ఇక్కడ అన్ని కాలల్లోనే నీరు పైనుంచి జాలువారుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా మండు వేసవిలో నెమ్మదిగా జాలువారే జలపాతం.. భక్తులు పెరుగుతున్న కొద్దీ జలపాతం మరింతగా పెరుగుతుందని ఇక్కడి ఆదివాసీల నమ్మకం.

ప్లాస్టిక్ కవర్లు పూర్తిగా నిషేధం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా సలేశ్వరం ఉత్స-వాలకు లక్షలాది మంది భక్తులు వస్తున్నందునా ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించరాదని అటవీశాఖ అధికారులు భక్తులను కోరుతున్నారు. అలాగే మార్గమధ్యలో భక్తు-లకు అవగాహన కల్పించేందుకు ప్లాస్టిక్ నిషేధం వంటి బ్యానర్లును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ కవర్లతో పాటు కాలుష్యం పెరుగడంతో పాటు వేసవిలో అడవి జంతువులు ప్లాస్టిక్ కవర్లు తిని మృత్యువాత పడుతు-న్నందున ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నారు.

– కేశవ