కొందరు ఇంట్లో ఉండే వస్తువులు ఇలానే ఉంచాలి, ఈ యాంగిల్ లోనే పెట్టాలి అనుకుంటారు. వాస్తుప్రకరాం ఇంటినిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో కొన్ని వస్తువులు ఉండడం వలన ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. అలాగే కొన్ని నియమాలు పాటించడం వలన కష్టాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెప్తుంది.. వాస్తు నియమాలు అనుసరించడం ద్వారా ఇంట్లో సానుకూలత వస్తుంది…
సంతోషం, శాంతితో నిండిన వాతావరణం కలుగుతుంది. వాస్తు ప్రకారం.. వెండి తాబేలును ఇంట్లో ఉంచుకుంటే..డబ్బుకు లోటు ఉండదని.. శారీరక సమస్యలు మనకు దూరమవుతాయని అంటారు. మరి వాస్తు ప్రకారం వెండి తాబేలు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో చూద్దామా.?
ఆర్థిక కష్టాలు
ఇంట్లో డబ్బు లేకపోవడం వంటి పరిస్థితులను ఎదుర్కోంటున్నవారు.. ఇంట్లో వెండి తాబేలును ఉంచుకోవాలి. దీనిని ఉత్తరాన ఉంచడం మంచిది. ఇందుకోసం గాజు పాత్ర తీసుకుని అందులో కొంచెం నీరు పోసి అందులో తాబేలును వేసి పెట్టాలి. కావాలంటే నీళ్లు లేకుండా ఖాళీ గాజు పాత్రలో వెండి తాబేలు పెట్టుకోవచ్చు. ఆర్థిక కష్టాలను తగ్గిస్తుంది.
వ్యాపారంలో లాభం..
వ్యాపారంలో నష్టాలు ఉన్నవారు వెండి తాబేలును తీసుకోవాలి. ఇందుకోసం వెండి తాబేలుతో చేసిన ఉంగరాన్ని ధరించవచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తాబేలు ఎక్కువగా నీటిలో ఉంటుంది. ఈ కారణంగా సంపద దేవత అయిన లక్ష్మీ దేవికి సంబంధించిందని విశ్వసిస్తారు. తాబేలు ఉంగరాన్ని ధరించేముందు దానిని పచ్చి పాలలో ఉంచి.. పూజ చేసిన తర్వాత మాత్రమే ధరించాలని గుర్తుపెట్టుకోండి.
విద్యార్థుల కోసం..
మీ పిల్లలు చదువుకోవడానికి ఆసక్తి చూపకపోవడం.. కష్టపడి చదివినా ఆశించినంత ఫలితాలు రాకపోయినప్పుడు కూడా వెండి తాబేలును ఉపయోగించుకోవచ్చట. వారు చదువుకునే స్థలంలో వెండి తాబేలును పెట్టాలి. దీనివలన పిల్లల మనససు ప్రశాంతంగా ఉంటుంది.. చదువులో సక్రమంగా ఏకాగ్రతతో ఉంటారు.
వేడి తాబేలును ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి లాభాలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. కొందరికి ఇలాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండదు. పెద్దగా పట్టించకోరు. నమ్మకం ఉన్నవారు..మాత్రం పాటించటంలో తప్పేం లేదుగా.. సైంటిఫిక్ రీజన్స్ అన్నింటికి దొరకకపోవచ్చు..కానీ కచ్చితంగా ఉంటాయి అని చాలామంది నమ్ముతుంటారు.
-Triveni Buskarowthu