వాస్తు: తెల్ల రంగు గచ్చు ఈ దిక్కులో ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి…!

-

చాలా మంది వాస్తుని నమ్ముతుంటారు, అనుసరిస్తూ వుంటారు. వాస్తు శాస్త్రం గురించి ఈ రోజు పండితులు కొన్ని విషయాలు చెప్పారు. చాలా మందికి ఏ దిక్కులో ఏ వస్తువులు ఉంచాలో తెలుసు. కానీ ఎటువంటి గచ్చు ఇంట్లో ఉండాలి అనేది కాస్త అనుమానంగా ఉంటుంది. అందుకని పండితులు ఫ్లోర్ కి సంబంధించి పలు విషయాలు చెప్పారు. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా తెలుసుకోండి.

సాధారణంగా మనం ఇల్లు కట్టించుకునేటప్పుడు ఎన్ని ద్వారాలు ఉండాలి..?, ఏ దిక్కులో ఏది పెట్టాలి..? అనేది మనం తెలుసుకుని దానిని అనుసరిస్తూ ఉంటాం. కానీ ఫ్లోర్ కి సంబంధించిన విషయాలపై కూడా దృష్టి కూడా పెట్టాలి. అయితే చాలా మంది మర్చిపోతూ ఉంటారు. మీరు కనుక ఈ విషయాన్ని గమనిస్తే ఫ్లోర్ కలర్ కూడా మీరు సరిగ్గా వాస్తు ప్రకారం నిర్మించుకోవడానికి వీలు అవుతుంది.

ఫ్లోర్ ని నిర్మించేటప్పుడు వాయువ్యం వైపు తెల్ల రంగు గచ్చు వేయించుకోవడం మంచిదని వాస్తుశాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లరంగు గచ్చుని పడమర కోణం వైపు అంటే వాయువ్యం వైపు ఉండాలి అలా చేయడం చాలా మంచిదని అంటున్నారు.

ఆ దిక్కు లో అలా తెల్ల రంగు గచ్చు ఉంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అలా ఉండడం వల్ల మానసిక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు. అలానే సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అని అంటున్నారు. మీ జ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. మీ తండ్రి తో మీ యొక్క బంధం కూడా బాగుంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news