ఇరవైల్లో ఉండే ఆలోచనలు ముఫ్ఫైలో ఉండవు. 30ల్లో ఉండేవి నలభైలో ఉండవు. వయసు పెరుగుతున్నకొద్దీ ఆలోచనలు మారుతూనే ఉంటాయి. అనుభవాలు పాఠాలు చెబుతూనే ఉంటాయి కాబట్టి ఆలోచనల క్రమం మారుతూ ఉంటుంది. ఇరవైల్లో ఎలా ఉన్నారో నలభైల్లోనూ అలాగే ఉన్నారంటే వాళ్ళు అదృష్టవంతులే, అలాగే దురదృష్టవంతులు కూడా. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎలా ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం వయసు పెరుగుతున్న కొద్దీ మారే ఆలోచనల గురించి మాట్లాడుకుందాం.
ఒంటరితనం అనేది చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా పోయేది కాదు. నీ మనసుకు నచ్చిన వాళ్ళు దొరికినప్పుడే పోతుంది.
మీ భాగస్వామి మీ అన్ని అవసరాలను తీర్చదు. అది వాళ్ళ పని కూడా కాదు.
వ్యాపారంలో లాభాలు మీకు మనశ్శంతిని ఇవ్వనట్లయితే వాటిపై ఎక్కువ శ్రమ, శక్తి ఖర్చు చేయవద్దు.
జీవితంలో అతి పెద్ద పరీక్ష, మిమ్మల్ని అపార్థం చేసుకునే వారి హ్యాండిల్ చేయాల్సి రావడం. ఇది చాలా కష్టం సుమీ..
నీకు నువ్వే పరిధులను గీసుకుని అందులోకి ఎవ్వర్నీ రానివ్వకుండా చేసుకోగలవు.
నీ ఆలోచనలని, భావాలని పట్టించుకోని వారికోసం నీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవద్దు.
మాట్లాడినా, మాట్లాడకపోయినా కొందరు చాలా ముఖ్యమైన వారు ఉంటారు. జీవితంలో వారికి చాలా ప్రాముఖ్యతని ఇస్తుంటారు.
అవతలి వారి అర్హతని మించి ప్రాముఖ్యతని ఇస్తున్నారంటే, మీ అర్హతని మించి గాయపడాల్సి ఉంటుంది.
ఎవరితో అయితే ఎక్కువ సమయం గడుపుతారో, వాళ్లే మీ జీవితాన్ని మలుపు తిప్పేవారవుతారు. మీరు కూడా వాళ్ళలా మారే అవకాశం ఉంటుంది.
ఇవన్నీ వయసు పెరుగుతున్న కొద్దీ అనుభవంలోకి వస్తాయి.