కలలో ఈ పూలు కనపడుతున్నాయా..? దానికి అర్ధం ఇదే..!

-

సాధారణంగా మనకు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏదో జంతువు వేటాడినట్లు కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు అయితే ధనవంతులు అయిపోయినట్లు కలలు వస్తుంటాయి. మరి కొన్నిసార్లు పూలు కూడా కలలో కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీకు పూలు కలలో కనపడ్డాయా..? అయితే పూలు కలలో కనబడితే దానికి సంకేతం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా పూలు చాలా అందంగా ఉంటాయి. పూలని చూస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే కలలో మాత్రం పూలు కనబడితే భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలు అవి సూచిస్తాయి. మరి ఏ పూలు వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చు అనేది చూద్దాం.

గులాబీ పూలు:

గులాబీ పూలు చాలా అందంగా ఉంటాయి ఎంతో మంది గులాబీలను ఇష్టపడతారు. మీ కలలో కనుక గులాబీ పూలు కనబడితే మీ జీవితంలోకి ప్రేమికుడు వస్తున్నట్లు అర్థం. అలానే మీరు మరింత ప్రేమని గౌరవాన్ని పొందుతారని దానికి సంకేతం.

బంతిపూలు:

కలలో కనుక బంతిపూలు కనబడితే మీరు గొప్ప పుణ్యకార్యాలు చేయబోతున్నట్లు సంకేతం.

తామర పువ్వు:

మీ కలలో కనుక తామర పువ్వు కనబడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి ధనం వస్తుంది అని తామరపువ్వు సూచిస్తుంది.

ఎండిపోయిన పూలు:

మీ కలలో కనుక ఎండిపోయిన పూలు కనబడ్డాయంటే మీరు ఎవరితోనో గొడవ పడతాయని సంకేతం ఒకవేళ కనుక రంగురంగుల పూలు కనపడితే శుభవార్త వింటారు అని దానికి అర్థం.

మల్లెపువ్వు:

అదృష్టం మీ జీవితంలోకి రాబోతోందని మల్లెపువ్వు సూచిస్తుంది ఇలా పూలు జీవితంలో జరగబోయే విషయాలను చెబుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news