రేవంత్ కు షాక్… గజ్వేల్ సభకు ఉత్తమ్. జగ్గారెడ్డి డుమ్మా !

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు సొంత ఇలాక అయిన గజ్వేల్ నియోజక వర్గం లో ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ దళిత గిరిజన దండోరా సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో… గజ్వేల్ నియోజక వర్గంలోని దళిత గిరిజన దండోరా సభ కు హజరయ్యారు కాంగ్రెస్‌ పార్టీ టీపీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్ రెడ్డి. ఎంపీ రేవంత్‌ రెడ్డి తో సహా రాజ్య సభ సభ్యులు మల్లిఖార్జున ఖర్గే మరియు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి ఠాగూర్ కూడా పాల్గొన్నారు.

అయితే… ఈ దళిత గిరిజన దండోరా సభ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. ఈ భారీ సభకు కీలక నేతలైన మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మరియు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. మొదట వీరిద్దరూ వస్తారని అనుకున్నా… చివరి క్షణం లో వీరు హజరు కాలేదు. కాగా.. ఈ సభ కు కోమటి రెడ్డి బ్రదర్స్‌ కూడా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.