వాస్తు: ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని పాటించండి..!

పండితులు చెబుతున్న ఈ విషయాలను కనుక పాటించారంటే తప్పకుండా ఆరోగ్యం బాగుంటుంది. అదే విధంగా జీర్ణ సమస్యలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. అయితే ఇక మరి ఆలస్యమెందుకు వాస్తు ( Vasthu ) పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను చూసేద్దాం.

ప్రతి ఒక్కరు కూడా వాస్తుకు తగ్గట్లు అనుసరించడం మంచిది. దీని వల్ల ప్రయోజనాలు పొందవచ్చు. ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండే స్టవ్, మైక్రోవేవ్ ఓవెన్ మొదలైన మంట కలిగించే వాటిని అన్నిటిని కూడా దక్షిణ దిశలో ఉంచితే మంచిదని అంటున్నారు పండితులు. అదే విధంగా వంటింట్లో ఉండే స్లాబ్ రంగు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎక్కడయితే మనం ఇలా మంట కలిగే వస్తువులు పెడతామొ.. ఆ స్లాబ్ కి ఉండే రంగుని కూడా ఈ విధంగా పాటిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.

ఎప్పుడూ కూడా ఆ స్లాబ్ పసుపు రంగులో కాని ఆకుపచ్చ రంగులో కాని ఉంటే మంచిదని చెబుతున్నారు. సరైన దిక్కులో వంటగదిలో ఉండే స్టవ్ పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు, అజీర్ణ సమస్యలు దీని వల్ల వస్తాయని కనుక జాగ్రత్తగా మార్పులు చేసుకుంటే మంచిదని అన్నారు. అలానే ఎప్పుడూ కూడా చెత్తాచెదారం లేకుండా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.