వాస్తు: వంటింట్లో ఈ మార్పు చేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది..!

వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వల్ల ఏ సమస్యలు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. అలానే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని పండితులు అంటున్నారు. ఈరోజు మన కోసం పండితులు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలు చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా సమస్యలన్నీ దూరం అయిపోతాయి.

 

vasthu

సాధారణంగా మన ఇంట్లో మనం పాటించే పద్ధతులు బట్టి మనకి సమస్యలు రావడం అనేది జరుగుతుంది. ఏ సమస్య లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే వాస్తు చిట్కాల్ని తప్పక పాటించాలి. మన ఇంట్లో అన్ని గదులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా వంట గదికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి.

వంటగది బట్టి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వంటగదిలో కనుక ఈ మార్పులు చేశారంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటుంది. వంటగదిలో కనుక పాజిటివ్ ఎనర్జీ రావాలంటే వంట గదికి తెలుపు రంగు లేదా క్రీమ్ కలర్ పెయింట్ వేయాలి. ఇలా చేయడం చాలా మంచిది.

వాస్తు దోషాలు కూడా దీని వల్ల తొలగిపోతాయి. అలానే ఒక పక్క గోడకి మీరు కావాలంటే ఎరుపు రంగు పెయింట్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా చాలా శుభదాయకం. దీని వల్ల జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి. అలాగే ఇబ్బందులు అన్నీ తొలగిపోతుంది కనుక తప్పకుండా చిట్కాలు పాటించి ఏ సమస్య లేకుండా ఉండండి.