వాస్తు: ఇలా వున్న హనుమంతుడిని ఇంట్లో ఉంచితే మంచిది కాదు..!

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పద్ధతులని ఫాలో అయితే ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు. చాలా మంది ఏదో ఒక ఇబ్బందితో సతమతమవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలు పాటిస్తే మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ తప్పులు చేయొద్దు అని చెబుతున్నారు.

 

lord-hanuman
lord-hanuman

పూజ గదిలో చాలా మంది చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి తప్పుల వల్ల ఇబ్బందులు వస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అయ్యి.. ఆ తప్పులు చేయకుండా ఉంటే మంచిది అని పండితులు అంటున్నారు. ఇంట్లో ఎప్పుడూ కూడా పూజ గదిలో నవ్వుతూ ఉండే దేవుడి విగ్రహాలని పెట్టుకోవాలని అంటున్నారు.

కోపంగా ఉండేవి, యుద్ధాలు జరిగేవి అసలు ఉంచొద్దు అని అంటున్నారు. వీటిని ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందుకని వాటిని అస్సలు పూజగదిలో పెట్టుకోవద్దు. ఇదిలా ఉంటే హనుమంతుడి విగ్రహం పెట్టేటప్పుడు పెద్ద విగ్రహం ఎప్పుడూ పెట్టొద్దు. చిన్న విగ్రహం మాత్రమే దేవుడి గదిలో ఉంచండి. అలాగే హనుమంతుడు కూర్చున్న ఉన్న విగ్రహాన్ని పెట్టడం వల్ల మంచి కలుగుతుంది. కనుక పూజ గదిలో ఈ పద్ధతిని ఫాలో అయ్యి ఏ ఇబ్బంది లేకుండా ఉండండి. దీంతో మీరు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. అలానే ఏ సమస్య వున్న కూడా తొలగిపోతుంది.