వెండి మన శరీరానికి చలువ చేస్తుంది. వెండి వస్తువులు ధరిస్తే శరీరంలో ఉన్న వేడి బయటకు పోతుంది. కనుక పాదాలకు ఎప్పుడూ వెండితో తయారు చేసిన ఆభరణాలనే ధరించాలి.
మహిళలు పాదాలకు పట్టీలు ధరించడం అన్నది మన భారతీయ సంప్రదాయాల్లో ఒకటి. మన దేశంలో ఉన్న చాలా వర్గాలకు చెందిన మహిళలు కాళ్లకు పట్టీలను ధరిస్తారు. అయితే ఆ పట్టీలు వెండితో చేసినవే అయి ఉంటాయి. మహిళలు వివాహం చేసుకున్న సందర్భంలో కాలివేళ్లకు మెట్టెలు తొడుగుతారు. అదే పట్టీలు అయితే ఆడపిల్ల పుట్టగానే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వారి పాదాలకు పట్టీలను తొడుగుతారు. పట్టీలు తొడుక్కుని ఆడపిల్లలు ఇంట్లో సందడిగా తిరుగుతుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని పండితులు చెబుతారు. అయితే పట్టీలను ఏ మహిళ అయినా సరే.. వెండి లోహంతో చేసినవే ధరించాలి. కానీ నేటి తరుణంలో చాలా మంది బంగారంతో చేసిన పట్టీలను తొడుగుతున్నారు. నిజానికి ఇలా చేయడం సరికాదు. ఇందుకు శాస్త్రీయంగానే కాదు, పురాణాల పరంగా కూడా కారణాలు ఉన్నాయి. అవేమిటంటే…
సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం.. బంగారం అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి అనే చెబుతారు. అలాగే లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమట. ఈ క్రమంలో బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది కనుక.. ఆ రంగులో వస్తువులు ఏవైనా సరే.. ఆఖరికి పట్టీలు అయినా సరే.. పాదాలకు ధరించకూడదు. ఇక ఈ విషయంలో సైన్స్ చెబుతున్నదేమిటంటే…
వెండి మన శరీరానికి చలువ చేస్తుంది. వెండి వస్తువులు ధరిస్తే శరీరంలో ఉన్న వేడి బయటకు పోతుంది. కనుక పాదాలకు ఎప్పుడూ వెండితో తయారు చేసిన ఆభరణాలనే ధరించాలి. అదే బంగారం అయితే ఒంట్లో వేడి పెరుగుతుంది. కనుక బంగారంతో చేసిన పట్టీలను వేసుకోరాదు. అయితే వెండితో చేసిన పట్టీలను ధరిస్తే నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు పోతాయట. అందుకోసమైనా మహిళలు వెండితో చేసిన పట్టీలను ధరించాల్సిందే..!