ఆగస్టు 9వ తారీఖుతో శ్రావణ మాసం వచ్చేసింది. మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం లో వ్రతాలు, నోములు, పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ మాసంలో ఆచరించాల్సిన నియమాలను పెద్దలు చెప్పిన విషయాలను తెలుసుకుందాం. మాంసాహారాన్ని ముట్టుకోకుండా ఉండడం దగ్గర నుండి మద్య సేవించకుండా ఉండడం వరకు కొన్ని నియమాలని పాటించాలి.
పవిత్ర శ్రావణ మాసం గొప్పగా ఉండడానికి చేయకూడని పనులు
- ముందే చెప్పినట్టు మాంసాహారం, మద్యం సేవించడం తగదు.
- వంకాయ కూర తినకూడదనే విషయం చాలా మందికి తెలియదు. పురణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని సమాచారం. అందువల్ల శ్రావణ మాసంలో దాన్ని తినకూడదని అంటారు. ఏకాదశి, చతుర్దశి వంటి కొన్ని ముఖ్య రోజులలో వంకాయ తినని వాళ్ళు చాలామది ఉన్నారు.
- శ్రావణ మాసంలో ఉపవాసం ఉండే భక్తులు శివుడి అభిషేకానికి పాలను ఉపయోగించవచ్చు. కానీ, పాలను పానీయంగా తీసుకోకూడదు.
- శివపూజ చేసేవారు రోజూ ఉదయం ఎంత వీలైతే అంత తొందరగా మేల్కొని పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. సూర్యుడు రాకముందే నిద్రలేవడం మంచిది.
- శివపూజకి ముఖ్యంగా శివుడి అభిషేకానికి పసుపు ఉపయోగించరాదు. చాలామంది ఇది మర్చిపోతుంటారు. కానీ, పసుపు అభిషేకానికి వాడవద్దు.
- ఈ పవిత్ర మాసంలో మీ మనసు పవిత్రంగా ఉంచుకునేందుకు మీ ఇంటిని, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- శ్రావణ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి. అన్ని విషయాల్లో సంయమనంగా ఉండాలి.
పై విషయాలన్ని పాటిస్తూ పవిత్ర శ్రావణ మాసంలో చేయాల్సిన వ్రతాలు, నోములు చేసుకోవచ్చు.
శ్రావణమాసం విశిష్టత, పూజలు, ఆచరించాల్సిన పద్ధతులు..!