చాలామంది బరువు తగ్గాలని చూస్తూ ఉంటారు. బరువు తగ్గడం కోసం మీరు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారా.. అయినా కూడా బరువు తగ్గటం లేదా.. అయితే కచ్చితంగా మీరు ఈ నాలుగు విషయాలని గుర్తుపెట్టుకోవాలి. వీటిని పాటించడం వలన ఈజీగా బరువు తగ్గొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇక ఇలా చేయండి. బరువు తగ్గడానికి మీరు ఈ చిట్కాలను పాటించినట్లయితే ఒక నెల లోనే రెండు నుండి నాలుగు కిలోల బరువును తగ్గొచ్చు.
షుగర్ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు షుగర్ ని పూర్తిగా తగ్గించేయండి. షుగర్ వలన ఒంట్లో కొవ్వు పేరుకు పోతుంది. బెల్లీ ఫ్యాట్ కరిగిపోవడం వంటివి కూడా జరుగుతాయి. కాబట్టి షుగర్ కి దూరంగా ఉండాలి. శక్తి కోసం కార్బోహైడ్రేట్స్ అవసరం. కొద్ది పరిమాణం లో తీసుకోవాలి. బ్రెడ్ అన్నం బంగాళదుంపలు అలానే ఓట్స్ వంటివి కొద్దిగానే తీసుకోవాలి.
మాంసాహారులు ప్రోటీన్ ఫుడ్ తో పాటుగా ఆలివ్ ఆయిల్ ఆవనూనె నట్స్ వంటివి తీసుకోవాలి శాఖాహారులు ప్రోటీన్ ఫుడ్స్ తో హెల్తి కొవ్వుని తీసుకోవాలి. బరువు తగ్గాలంటే జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ కి ఎంత దూరంగా ఉంటే అంత ఈజీగా బరువు తగ్గొచ్చు బరువు తగ్గడానికి జిమ్ లో వెయిట్స్ లిఫ్ట్స్ చేయడం మంచిది కండరాలని బలంగా చేస్తుంది పైగా జీవక్రియ సక్రమంగా జరిగేటట్టు చూస్తుంది. ఈ నాలుగు విషయాలని మీరు పాటించినట్లయితే బరువు ఈజీగా తగ్గొచ్చు.