పూజ చేస్తున్నప్పుడు వీటిని అస్సలు నేల మీద పెట్టకూడదు..ఎందుకంటే?

-

దేవుడికి పూజ చెయ్యడం చాలా మంచిది.ఎంత భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారో అంతగా మనకు మంచి జరుగుతుంది..దేవుడి చల్లని చూపు మనమీద ఉంటుంది.సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వెలుగుతుందని ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన దైవాన్ని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.ఉదయం, సాయంత్రం స్నానమాచరించి దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి పూజల వలన ఎటువంటి ప్రయోజనం కలుగదు. ఇంటి సమస్యలు అలానే ఉంటాయి. దీనికి కారణం పూజ చేసేటప్పుడు తెలిసి, తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. అందుకే దేవుని అనుగ్రహం వారిపై కలుగదు. అందువలన ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. అవేమిటో ఇప్పుడు చుద్దాము..

*. పూజ చేసేటప్పుడు దేవుని విగ్రహాన్నినేలపై అస్సలు ఉంచకూడదు. అలాగే దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు విగ్రహాలను కాని ఫోటోలను కాని ఒక పీఠ మీద కాని ఒక శుభ్రమైన గుడ్డ మీద కాని పెట్టాలి. నేలపై అస్సలు పెట్టకూడదు. ఇలా దేవుడి విగ్రహాలను నేలపై పెట్టడం వలన దేవుళ్లను అవమానించినట్లు అవుతుంది. మీ ఇంట్లో దరిద్య్రం తాండవం చేస్తుంది.ఏదైనా పీట మీద లేదా గుడ్డ మీదనో పెట్టాలి.ఆ తర్వాత యధావిధిగా పూజ చేయోచ్చు..

*.దేవుడి గది లోపల మాత్రమే దీపాన్ని వెలిగించాలి. నేలపై దీపాన్ని పెట్టి దేవుడిని పూజించకూడదు. ఎప్పుడైనా సరే దీపాన్ని ఒక ప్లేట్ లో కాని ఒక స్టాండ్ లో కాని పెట్టి వెలిగించాలి.దీపాన్ని నేలపై పెట్టి అస్సలు వెలిగించకూడదు. ఇలా చేస్తే ఇంటికి కీడు కలుగుతుంది. అందుకే దీపం వెలిగించే ముందు నేలపై వరిపిండితో ముగ్గు వేసుకొని దానిపై ఒక ప్లేట్ లేదా స్టాండ్ పెట్టి అందులో దీపాన్ని వెలిగించాలి.

*.శంఖాన్ని ఎల్లప్పుడూ దేవుని గదిలోనే ఉంచాలి. ఎందుకంటే శంఖం లక్ష్మీదేవికి ప్రతీక. కాబట్టి దానిని నేలపై అస్సలు ఉంచకూడదు. అది లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. శంఖాన్ని నేలపై ఉంచడం వలన ఇంట్లో ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఇంట్లోని వారు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోంటారు.

*. బంగారం, వెండి, వజ్రాలు మొదలగు విలువైన వాటిని నేలపై ఉంచకూడదు.ఎందుకంటే ఇవి ఏదో ఒక గ్రహానికి సంబంధించినవి. కనుక వీటిని నేలపై ఉంచడం వలన వారికి అవమానించినట్లు అవుతుంది. పూజ అయిపోయాక రత్నాలను నేలపై ఉంచితే వాటి ప్రభావం తగ్గుతుంది.కాబట్టి వాటిని ఒక గుడ్డలో చుట్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోను వీటిని నేలపై ఉంచకూడదు. ఇంటికి శుభం కలగాలంటే ఈ నాలుగు వస్తువులను నేలపై అస్సలు పెట్టకూడదు..ఇవి పూజ చేస్తున్నా వాళ్ళు తప్పక గుర్తు పెట్టుకోవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version