ఇండియన్ నేవి లో ఖాళీలు ఉన్న ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.ముంబాయిలోని నావెల్ డాక్‌యార్డ్..అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతం, ఇంటర్వ్యూ మొదలగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య: 338
పోస్టుల వివరాలు: అప్రెంటిస్ పోస్టులు
విభాగాలు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, మెరైన్ ఇంజిన్ ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, ప్యాటర్న్ మేకర్, మెకానిక్ డీజిల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్ (జనరల్), షీట్ మెటల్ వర్కర్, పైప్ ఫిట్టర్, మెకానిక్ రెఫ్ అండ్ ఏసీ, టైలర్ వంటి ఇతర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయస్సు: అభ్యర్ధులు ఆగస్టు 1, 2001 నుంచి అక్టోబర్ 31, 2008 మధ్య జన్మించి ఉండాలి.
స్టైపెండ్:
ఐటీఐ అభ్యర్ధులకు నెలకు రూ. 7,000
ఐటీఐ లేని అభ్యర్ధులకు నెలకు రూ. 6,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పదో తరగతిలో 50 శాతం మార్కులతోపాటు, పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన స్త్రీ, పురుషులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: పోస్టునుబట్టి రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 11, 2022.
ఈ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ను పూర్తీగా చదివిన తర్వాత అప్లై చేసుకోవాలి..