వాస్తు : తులసి మొక్కతో ఆర్ధిక సమస్యలు వుండవు..!

వాస్తు పండితులు ఈ రోజు వాస్తుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే శుభ ఫలితాలను పొందొచ్చు. హిందువులందరి ఇళ్లల్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. ప్రతీ రోజు తులసి మొక్క వద్ద శుభ్రం చేయడం, తులసి మొక్క ముందు ముగ్గు వేసి.. పూజ చేయడం లాంటివి చేస్తారు.

అలానే తులసి దళాలని దేవుడికి అర్పిస్తారు. ఇలా ఎవరి పద్దతి ప్రకారం వారు అనుసరిస్తారు. తులసి మొక్కకి పూజ చేయడం వల్ల ఎన్నో రకాల లాభాలు మనకి కలుగుతాయి. తులసి మొక్క వలన వాస్తు దోషాలు కూడా తులసి మొక్క తొలగిస్తుంది.

తులసి మొక్కని లక్ష్మీ దేవి స్వరూపంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు అదే విధంగా తులసి మొక్క వల్ల ఔషధ గుణాలు కూడా లభిస్తాయి. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఎటువంటి ఫలితాలు కనబడతాయి అనేది ఇప్పుడు చూద్దాం..

ఇంట్లో తులసి మొక్క ఉండటంవల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వుంటుంది. దీనితో ఎంతో మంచి ఫలితాలు కనబడతాయి. అనారోగ్య సమస్యలు రాకుండా ఇది చూసుకుంటుంది. అదే విధంగా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా తులసి మొక్క వలన తొలగిపోతాయి.

ఆర్ధిక సమస్యలతో బాధపడే వాళ్లు తులసి మొక్క నాటడం వల్ల మంచి కలుగుతుంది అలానే శాంతి, ఆనందం, ప్రశాంతత కలగజేస్తుంది తులసి.