జీవించాలనే కుతూహలాన్ని తగ్గించే నెగెటివ్ ఆలోచనలు మార్చుకోవడానికి ఇది ప్రారంభించండి.

-

కరోనా వచ్చాక చాలామంది ఎక్కువ ఆలోచించడం మొదలు పెట్టారు. ప్రతీ చిన్న విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం వల్ల అనేక సందేహాలు పుట్టుకొచ్చాయి. అలాగే వాటికి సమాధానం దొరక్కపోవడంతో అది మనసులోనే ఉండిపోవడం వల్ల మానసికంగా ఇబ్బంది పడడం ప్రారంభమయింది.

జరిగిపోయిన సంఘటనల గురించి ఎక్కువగా ఆలోచించడం, ప్రతీ పరిస్థితిని విశ్లేషించడం, ఒక పనిలో కేవలం నెగెటివ్ వైపు మాత్రమే ఆలోచించడం, మొదలైనవన్నీ జీవితాన్ని ఆస్వాదించకుండా చేస్తాయి. దీనివల్ల వర్తమానంలో కాకుండా భ్రమలో బ్రతికే ఫీలింగ్ కలగజేస్తుంది. అంతేకాదు మీలోని శక్తిని పూర్తిగా తగ్గించేసి నిరాశను తీసుకువస్తుంది. అందువల్ల ఈ సమస్య నుండి ఎంత తొందరగా బయటపడితే అంత బాగుంటుంది. దీని కోసం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

పాజిటివ్ సెల్ఫ్ కన్వర్షన్

ప్రతికూల ఆలోచనలు వచ్చినపుడు గట్టిగా అరవండి. అలా అరిచినపుడు మీ ఆలోచనలు ఎటో వెళ్ళిపోతున్నాయని తెలుసుకుని, అక్కడ నుండి పాజిటివ్ వైపు మళ్ళాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి.

వాతావరణాన్ని మార్చాలి

మీ జీవితంలోకి నెగెటివిటీని తీసుకువచ్చే వ్యక్తులను పక్కన పెట్టేయండి. మీకు సౌకర్యంగా లేని వారి గురించి ఆలోచించి మనసు బాధ చేసుకోవడం అనర్థం.

మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు

చాలామంది చేసే తప్పు ఇది. ఏదైనా జరగ్గానే ఛీ నేనిలా చేయకూడదు, నేనిలా ఎందుకు చేసానని పదే పదే తిట్టుకుంటారు. అది కరెక్టు కాదు.

దానివల్ల మీమీద మీకు నమ్మకం తగ్గిపోతుంది. తప్పులు ప్రతీ ఒక్కరు చేస్తారు అన్నది గుర్తుంచుకోవాలి.

మాట్లాడండి

మీ బాధలు లోపలే దాచుకుని చింతించవద్దు. నాకే ఎందుకిలా అవుతుందని అస్సలు అనుకోవద్దు. ఇతరులతో మాట్లాడండి. వారి బాధలు తెలుసుకోండి. మీ బాధలు పంచుకోండి. పంచుకుంటే ఆస్తులే కాదు బాధలు కూడా తగ్గుతాయని గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news