వాస్తు: సంధ్యవేళ ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే మీ ఇంటి నుండి లక్ష్మి దేవి వెళ్ళిపోతుంది..!

చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. నిజానికి వాస్తు ని ఫాలో అవ్వడం వలన మనం ఎన్నో సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పైగా వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. చాలా మంది జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అయితే మీరు కనుక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వీటిని కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా సంధ్య వేళలో ఇలాంటి తప్పులు చేయకూడదు. సంధ్యా సమయంలో ఎప్పుడు కూడా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి ఇలాంటి తప్పులు చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది.

సంధ్య వేళలో కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా గొడవలు పడకూడదు. కుటుంబ సభ్యులు సంధ్య వేళలో గొడవలు పడితే సమస్యలు వస్తాయి. పైగా లక్ష్మీదేవి కూడా బాధపడుతుంది మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది.
సంధ్య వేళలో ఎవరికైనా ఏదైనా సహాయం కావాలని వచ్చి అడిగితే లేదనుకుంటా చేయడం మంచిది. కాళీ చేతులతో ఎవరిని పంపకండి.
అలానే సంధ్య వేళలో తలుపులు క్లోజ్ చేసి ఉంచడం మంచిది కాదు. ఈ సమయంలో తలుపుల్ని తీసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ముఖద్వారాన్ని ఎప్పుడూ కూడా సంధ్య వేళలో మూసేయకండి.
సంధ్య వేళలో ఎప్పుడూ కూడా తులసి ఆకులను త్రుంచద్దు. ఇలా చేస్తే కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
అలానే ఎవరైనా సంధ్య వేళలో అప్పు అడిగితే అసలు ఇవ్వకండి.