వాస్తు: మెట్ల కింద అస్సలు వీటిని వుంచద్దు..సమస్యలు వస్తాయి..!

-

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. ఇంట్లో సామాన్లని సర్దేటప్పుడు కూడా వాస్తు ప్రకారం అనుసరించాలి వాస్తు ప్రకారం మీరు మెట్ల కింద ఈ తప్పులని అస్సలు చేయొద్దని వాస్తు పండితులు అంటున్నారు చాలామంది మెట్ల కింద ఈ వస్తువులని ఉంచుతారు.

దానితో ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి వాస్తు ప్రకారం మెట్ల మీద కొన్ని వస్తువులని ఉంచకూడదు వీటిని పెట్టడం వలన ఇబ్బందులు తప్పవు. పాజిటివ్ ఎనర్జీ దూరమై నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మరి మెట్ల కింద ఏమేమి ఉంచకూడదు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

షూ స్టాండ్:

షూ స్టాండ్ ని ఉంచకూడదు. షూ, చెప్పులు వంటి వాటిని ఉంచితే నెగటివ్ ఎనర్జీ వచ్చి పాజిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి.

దేవుడు మందిరం:

మెట్ల కింద దేవుడు మందిరాన్ని కూడా పెట్టకూడదు ఇది కూడా నెగటివ్ ఎనెర్జీని కలిగిస్తుంది పాజిటివ్ ఎనర్జీ ని దూరం చేస్తుంది కనుక దేవుడి మందిరాన్ని కూడా ఉంచకండి.

కుళాయిలని పెట్టకండి:

మెట్ల కింద చాలామంది బాత్రూం కడుతూ ఉంటారు లేదంటే వాష్ బేసిన్ వంటి వాటిని పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయొద్దు ఒకవేళ కనుక అలా కట్టుకున్నా ఆ కుళాయిల నుండి నీళ్లు లీక్ అవ్వకుండా చూసుకోండి.

చెత్తబుట్ట:

మెట్ల కింద చెత్తబుట్ట వంటి వాటిని కూడా పెట్టకూడదు ఇది కూడా నెగటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది.

లాకర్ వంటివి:

చాలామంది ఇంటి లోపల మెట్టల్ని కట్టుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు సురక్షితంగా ఉంటుందని లాకర్ వంటి వాటిని పెడుతూ ఉంటారు కానీ ఇలా చేయకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news