సిటీ బస్సులో రేడియో సేవలు.. పైలెట్ ప్రాజెక్టుగా 9 సిటీ బస్సుల్లో..

-

ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిఎస్ఆర్టిసి) కొత్త ఆలోచనలతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొనసాగేందుకు బస్సుల్లో రేడియోని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే సూపర్ లగ్జరీ, గరుడ బస్సుల్లో టీవీ అందుబాటులో ఉండగా.. బస్సులో రేడియో సేవలు తీసుకొచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత పైలెట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ సిటీలోని 9 ఆర్డినరీ, మెట్రో బస్సులలో ఈ రేడియోలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ నేపథ్యంలో నేడు హైదరాబాదులోని బస్ భవన్లో కూకట్పల్లి డిపో బస్సులో ఈ రేడియోని టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనర్ శనివారం ప్రారంభించారు. అనంతరం రేడియో పనితీరుని పరిశీలించారు. ఉప్పల్ – సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్ – సికింద్రాబాద్, గచ్చిబౌలి – మెహదీపట్నం, సికింద్రాబాద్ – పటాన్ చెరువు, కూకట్పల్లి – శంకర్ పల్లి, కొండాపూర్ – సికింద్రాబాద్, కోటి – పఠాన్ చెరువు, ఇబ్రహీంపట్నం – జేబీఎస్ మార్గాలలో నడిచే బస్సులలో ఈ రేడియోను ఏర్పాటు చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news