ముఖ్యమంత్రి గారికి కంటి పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది – వైఎస్ షర్మిల

-

సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి గారికి కంటి పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. దొరగారి పాలనలో దాదాపు 9,000 మంది రైతులు బలవన్మరణం చెందిన ఆ లెక్కలు కంటికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

24 గంటల నాణ్యమైన విద్యుత్ అని రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మహానేత వైయస్సార్ పథకాలు అన్నిటిని ఆపేసి పబ్బం గడుపుతున్నారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. “దేశ రాజకీయల కోసం దొరగారు రైతు ఆత్మహత్యలపైన అబద్ధాలు పలకడం సిగ్గుచేటు. నోరు తెరిస్తే అబద్దాలేనని మరోసారి నిరూపించుకున్నందుకు కేసిఆర్ కు ధన్యవాదాలు. తెలంగాణను అప్పుల, ఆత్మహత్యల తెలంగాణగా మార్చిన కేసీఆర్.. రైతుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయాడు.

పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు రైతుల ఆత్మహత్యలు వెల్లడించిన.. ఆ లెక్కలు దొరకంటికి కనిపించడం లేదు. ఏటా ఎన్సీఈఆర్బి ఆత్మహత్యల గణాంకాలు విడుదల చేస్తున్న.. దొరగారికి నెత్తికెక్కడం లేదు. ముఖ్యమంత్రి గారికి కంటి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే ఎర్రగడ్డ లోను టెస్టులు చేసుకోవాలి. మతితప్పి మాట్లాడుతున్న కేసిఆర్ కు రైతులు ఆత్మహత్యలు ఎక్కడ కనిపిస్తాయి” అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news