వాస్తు: నైవేద్యం విషయంలో ఈ తప్పులు చెయ్యద్దు…!

మన ఇంట్లో చేసే తప్పులు వల్ల మన మీద చాలా ప్రభావం పడుతుంది. ఇలా నెగిటివ్ ప్రభావం పడినప్పుడు ఎన్నో సమస్యల్ని మనం ఎదుర్కోవలసి వస్తుంది. అందుకని వీలైనంత వరకు చేసే తప్పులు తెలుసుకుని వాటిని చేయకుండా చూసుకోవడం మంచిది. మన ఇంట్లో చేసే చిన్న పొరపాట్ల వల్ల మనం ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

 

బెడ్ రూమ్, హాల్, పూజ గది ఎలా ఇంట్లో ప్రతిచోట కూడా వాస్తుని అనుసరించాలి. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేకుండా పాజిటివ్ ఎనర్జీని ఉండేటట్టు చూసుకోవాలి. అయితే పండితులు ఈ రోజు పూజ గదిలో ఈ తప్పులు చెయ్యొద్దని ముఖ్యంగా నైవేద్యం సమయంలో ఈ తప్పులు చేయకూడదు అనే విషయాన్ని తెలియజేశారు. మరి ఇక ఆలస్యం ఎందుకు వాస్తు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాల గురించి చూసేద్దాం.

ఈరోజు వాస్తు పండితులు నైవేద్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. సాధారణంగా ప్రతి ఒక్కరూ పూజ చేసిన తర్వాత భగవంతుడికి ఏదో ఒకటి నైవేద్యం కింద సమర్పిస్తారు. అయితే చాలామంది ఏం చేస్తారంటే… నైవేద్యం పెట్టేసిన తర్వాత మళ్లీ దానిని అక్కడే ఉంచుతారు. కానీ అది నిజంగా తప్పు.

దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే ఇబ్బందులుకి కూడా దారి తీస్తుంది. అందుకని నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని వీలైనంత వరకు అందరికీ పంచేయాలి. అలా ఇస్తే పుణ్యం వస్తుంది అలానే నెగటివ్ ఎనర్జీ కూడా పోతుంది. అదే విధంగా నైవేద్యం పెట్టేటప్పుడు పాత్ర విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. మీరు నైవేద్యం పెట్టినప్పుడు బంగారం, వెండి లేదా రాగి పాత్రల్లో వేసి నైవేద్యం పెడితే మంచిది. లేదా చెక్క, మట్టి పాత్రలు అయినా సరే మంచిదే. కనుక మీరు నైవేద్యం పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకొని వాటిని ఫాలో అవ్వండి. తద్వారా సమస్యలు రావు.