ఏపీ కరోనా అప్డేట్… కొత్తగా 503 కేసులు

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 503 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,58, 065 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 12 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,268 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 817 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,36, 865 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 32, 846 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 88, 00 , 809 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6932 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. కరోనా తగ్గుముఖం పట్టినా.. జాగ్రత్తలు తీసుకోవాలని సర్కార్‌ సూచనలు చేస్తోంది.