వాస్తు: ఆర్ధిక బాధలు వుండకూడదంటే.. ఈ తప్పులను అస్సలు చెయ్యకండి..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ఆర్ధిక సమస్యలకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఏమి ఉండకుండా ఉండాలంటే ఈ తప్పులని చేయకండి. ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అంటే ఇంట్లో విరిగిపోయిన బల్లలు కుర్చీలు వంటివి ఉండకూడదు. విరిగి పోయిన ఫర్నిచర్ ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇంట్లో విరిగిపోయిన కుర్చీలు వంటివి ఉంచకండి.

అలానే వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిపోయిన అద్దాన్ని ఇంట్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. విరిగిపోయిన డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వంటివి ఇంట్లో ఉంచకండి. వీటివలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కబోర్డ్ కి ఉండే అద్దం విరిగిపోయినా సరే మీరు వెంటనే దానిని తొలగించండి. తుప్పు పట్టిన అద్దం కూడా ఇంట్లో ఉండకూడదు ఇది కూడా సమస్యలను తీసుకువస్తుంది దీనివలన మీరు అప్పుల పాలైపోయే అవకాశం ఉందని వాస్తు పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ తప్పుని అస్సలు చేయకండి. ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన మంచం ఉండకూడదు. విరిగిపోయిన మంచం వున్నా సరే సమస్యలు వస్తాయి విరిగిపోయిన మంచం ఉండడం వలన దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news