వచ్చే ఎన్నికల్లో టిడిపి ఓడితే ఇక రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరని అన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. వచ్చే ఎన్నికలలో జగన్ ఓటుకు పదివేలు ఇచ్చినా.. అధికార దుర్వినియోగం చేసినా.. అరాచకాలు చేసిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఈరోజు ఎన్నికలు అన్నా టిడిపి రెడీగా ఉందన్నారు. మరోసారి సీఎం జగన్ ని నమ్మి అధికారులు బలి పశువులు కావద్దన్నారు.
అధికారులు ప్రజలకు న్యాయం చేయాలి కానీ.. జగన్ కి బానిసలా మారొద్దన్నారు. టిడిపి గెలుపు తన కోసమో, పార్టీ నేతల కోసమో కాదని.. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నారు. దౌర్జన్యాలు చేసిన వాళ్లపై వెధవల్లారా.. అంటూ తిరగబడితేనే దారికొస్తారని అన్నారు. ఇక రాష్ట్రంలో మరో కొత్త కార్యక్రమానికి టిడిపి శ్రీకారం చుట్టబోతుందన్నారు. ” ఇదేం కర్మ” అంటూ మరో సరికొత్త కార్యక్రమాన్ని డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. బాదుడే బాదుడు కంటిన్యూ చేస్తూనే ఇదేం కర్మ కార్యక్రమం చేపడతామన్నారు.