వాస్తు: వీటిని చూస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం వుంటుందట..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. దీనితో పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరం చేసుకుంటున్నారు. వాస్తు పండితులే ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెబుతున్నారు. వీటిని కనుక మనం అనుసరిస్తే మన ఇంట్లో లక్ష్మీ దేవి ఉంటుంది.

ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. అలానే ప్రతి రోజు వాడిపోయిన పూలని ఎండిపోయిన పూలను తీసేయడం వంటివి చేస్తూ ఉండాలి. చాలా మంది ఇళ్లల్లో దేవుడికి పూలని పెట్టి వాటిని చాలా రోజులు దాకా తొలగించరు నిజానికి. కానీ ఈరోజు పెట్టిన పూలు వెంటనే రేపు తొలగించాలి లేదంటే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది.

అలానే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పక్షి గూడు కడితే చాలా మంచిది. బాల్కనీలో కానీ కోర్ట్ యార్డ్ లో కానీ పక్షి గూడు కట్టిందంటే ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందట.
తరచు మన ఇళ్లల్లో బల్లులు కనబడుతూ ఉంటాయి. బల్లులు కనపడడం కూడా చాలా మంచిది. చాలామంది బల్లులను చూసి అసహ్యించుకుంటూ ఉంటారు కానీ బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
అదే విధంగా కుక్క బ్రెడ్ ముక్కని నోట్లో పెట్టుకుని పరిగెత్తి వెళ్లిపోవడం చూస్తే మనకి అదృష్టం కలుగుతుందట. అదే విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.