వాస్తు: ఇంట్లో పూజగదిలో ఈ తప్పులు చేస్తే ఇబ్బందులు వస్తాయి..!

మన ఇంట్లో సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలు పాటించాలి. ఈ చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు. అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు. వీటిని అనుసరిస్తే ఏ సమస్య లేకుండా ఉండొచ్చు. మరి పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి ఓ లుక్ వేసేయండి.

 

lakshmi ganapathi

వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని అనుసరిస్తే తప్పకుండా ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. ఎప్పుడూ కూడా పూజ గదిలో దేవుడిని వెనక్కి తిప్పి పెట్టకూడదు. ఎప్పుడు కూడా ముఖం ఎదురుగా ఉండేటట్లు మాత్రమే పెట్టాలి. వెనకభాగం ఎప్పుడూ కూడా ఎవరికీ కనపడకూడదు.

అదే విధంగా ఎప్పుడు కూడా రెండు కంటే ఎక్కువ వినాయకుడులని పూజ గదిలో పెట్టకూడదు. రెండు కంటే ఎక్కువ వినాయకుడులను ఉండడం వల్ల మంచిది కాదు అని పండితులు చెప్తున్నారు. ఒకే దేవుడు ఫోటో వేరే వేరే చోట ఉండొచ్చు. కానీ ఒకే దగ్గర ఉండకూడదు.

అలానే ఇంట్లో ఉండే దేవుడు ఎప్పుడూ కూడా శాంతంగా, అందంగా ఉండాలి. ఇలా ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుంది. పగిలిపోయినవి కానీ విరిగిపోయినవి కానీ అసలు దేవుడి గదిలో వంచకూడదు. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉంటే మంచి కలుగుతుంది. అంతేకాదు ఏ సమస్యలు లేకుండా ఉండొచ్చు.