వాస్తు: పడమర వైపు ఆ మొక్కని నాటితే ఆర్ధిక ఇబ్బందులే వుండవు..!

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ఓ మొక్కకు సంబంధించి కొన్ని విషయాలను చెప్పారు. ఈ మొక్క కనుక ఇంట్లో ఉంటే సిరులు కురుస్తాయట.

 

ఆర్ధిక ఇబ్బందులని కూడా మనం దూరం చేసుకోవచ్చట. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అరటి మొక్క ఉంటే చాలా మంచిది అరటి మొక్కని ఇంట్లో ఉంచడం వలన చాలా రకాల సమస్యల నుండి మనం బయటపడడానికి అవుతుంది. అయితే వాస్తు ప్రకారం అరటి మొక్కని తప్పు దిశలో ఉంచడం వలన కూడా ఇబ్బందులు వస్తాయి. అయితే అరటి మొక్కని ఎటువైపు పాతాలి ఎటువైపు ఉంటే మంచిది అనే విషయాలని ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తూర్పు వైపు కానీ దక్షిణ వైపు కానీ అరటి మొక్క ఉండకూడదు. అలానే ఆగ్నేయ వైపు కూడా అరటి మొక్క ఉండకూడదు. ఈ దిక్కు లో ఉన్నట్లయితే సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టే. అరటి మొక్క ని వాస్తు ప్రకారం పడమర వైపు నాటితే చాలా మంచిది. పడమర వైపు ని అరటి మొక్క ఉంచడం వలన సమస్యలు తొలగిపోతాయి. పిల్లలకు సంబంధించి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి పెళ్లి కానీ అమ్మాయిలకి పెళ్లి అవుతుంది.

పెళ్లి అయ్యి ఇబ్బంది పడే అమ్మాయిల జీవితం బాగుంటుంది. చక్కటి విద్యా జ్ఞానం పొందడానికి కూడా అవుతుంది. గురువారం నాడు స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి నీళ్ళని అరటి మొక్కకి పోస్తే చాలా మంచిది అరటి మొక్క ఎదుట బెల్లం పెట్టి ఉంచితే చాలా మంచిదట. శ్రీహరి విష్ణు మంత్రాలని కానీ బృహస్పతి మంత్రాలని కానీ చదివితే చాలా మంచి కలుగుతుంది ఇలా ఈ విధంగా మీరు అనుసరించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ కలిగి ఆనందంగా ఉండడానికి అవుతుంది.