RADHE SHYAM : “రాధేశ్యామ్” లవ్ ఆంథెమ్ ప్రోమో రిలీజ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు ఇక పండగే

-

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యాం సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది.

1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.  “రాధేశ్యామ్” లవ్ ఆంథెమ్ ప్రోమోను  రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఇక ఈ సాంగ్‌ లో ప్రభాస్‌, పూజా హెగ్డే చాలా అందంగా కనిపించారు. లవ్‌, ఎమోషనల్‌ ఫీలింగ్‌ ఇద్దరూ అలరించారు. లవ్ ఆంథెమ్ ఫుల్ సాంగ్ డిసెంబర్ 1 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news