వాస్తు: సమస్యలు దూరం అవ్వాలంటే ఈ మొక్కలని ఇంట్లో నాటండి..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఏ బాధ ఉండదు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వాస్తు ని అనుసరిస్తున్నారు. వాస్తుని అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది మీ ఇంట్లో ఏ సమస్యలు వస్తున్నా సరే వాస్తు ప్రకారం నడుచుకోండి అప్పుడు బాధల నుండి బయటపడొచ్చు.

పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని పంచుకున్నారు వీటిని కనుక మీరు అనుసరిస్తే మీ ఇంట్లో కూడా ఎలాంటి బాధ ఉండదు. మొక్కలకి సంబంధించి ముఖ్యమైన విషయాలని పండితులు చెప్పారు అవి ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం. ప్రతి హిందువు ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కకి ప్రతి రోజు పూజ చేస్తూ ఉంటారు. నిజానికి తులసి మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పైగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తులసి మొక్కతో పాటుగా ఈ మొక్కలు కూడా ఇంట్లో ఉంచితే చాలా మంచిది.

జమ్మి మొక్క:

జమ్మి మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు తొలగిపోతాయి. జమ్మి మొక్క ఇంట్లో ఉంటే శని దేవుడు అనుగ్రహం కలుగుతుంది. ఆనందంగా ఉండడానికి అవుతుంది ప్రశాంతంగా కూడా ఉండొచ్చు కాబట్టి జమ్మి మొక్కని ఇంట్లో నాటండి.

ఉమ్మెత్త మొక్క:

ఉమ్మెత్త మొక్క శివుడికి చాలా ఇష్టం ఇంట్లో ఉమ్మెత్త మొక్క ఉంటే చాలా మంచిది. నల్ల ఉమ్మెత్త మొక్కని ఇంట్లో ఆదివారం కానీ మంగళవారం కానీ నాటండి. ఇది ఆర్థిక ఇబ్బందుల్ని కూడా దూరం చేస్తుంది. అలానే శివుడి అనుగ్రహం కూడా ఇస్తుంది.

అరటి మొక్క:

అరటి మొక్కని ఇంట్లో ఉంచడం కూడా చాలా మంచిది ఇది ఇంట్లో ఉండటం వలన కుటుంబానికి మంచి జరుగుతుంది. ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news