పూజలో భాగంగా దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు?

Join Our Community
follow manalokam on social media

హిందువులు దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించుతారు. దీపం వెలిగిస్తే చీకటిపోతుంది. చీకటి, వెలుగు అంటే కష్టం-సుఖం, అజ్ఞానం-విజ్ఞానం అనే భావం కూడా ఉంటుంది. కాబట్టి దీపం వెలిగించడం వల్ల అజ్ఞానం, అంధకారం పోయి వెలుగు,విజ్ఞానం వస్తుంది అని అర్థం. అంతేకాదు చీకటిని కష్టంగా భావించి వెలుగును సుఖంగా హిందువులు భావించుతారు. దీపాన్ని వెలిగించితే వెలుగును ప్రసాదిస్తుంది.
కాబట్టి దీపం చీకటిని తరిమికొట్టి సుఖం అనే వెలుగునిస్తుంది. కనుక ప్రతిరోజూ దీపాన్ని వెలిగించి చెడు అనేది పోవాలి అని కోరుకోవాలి.

దీపం వెలుగులో ఎరుపు నీలం తెలుపు రంగులు కనబడతాయి ఆ మూడు రంగులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలు అని హిందూ ధర్మం చెబుతుంది. అంతేకాదు దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. దీపాలు సంపదకు గుర్తు. అందుకే హిందువులు దీపాన్ని భక్తితో ఆరాధిస్తారు. వీటితో పాటు మనలో ఉండే సత్వ, రజ, తమో గుణాలను పోగొట్టేందుకు దీపాన్ని వెలిగించాలి. అందుకే దీపం లో మూడు వత్తులు వేసి ఒక వత్తుగా చేసి వెలిగించాలి. దీనిబట్టి మనలో మూడు గుణాలు సమానంగా ఉండాలి అని మనం నేర్చుకోవాలి.

శాస్త్రం ప్రకారం దీపాన్ని రెండు పూటలా వెలిగించాలి. దీపాన్ని వెలిగించి ఏదో ఒక స్తోత్రం లేదా సహస్త్రాన్ని పఠించాలి. ఇలా చేస్తే కుటుంబంలో ఉన్న వారికి చాలా మంచిది. ప్రతి రోజు ఉదయాన్నే లేచి ఎంత త్వరగా దీపాన్ని వెలిగిస్తే అంత మంచిది మరియు సాయంత్రం సంధ్యా సమయం అంటే ఆరు గంటలకు దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే భగవంతుని అనుగ్రహం పొందవచ్చు. సమయం దొరకకపోతే ముందు దీపాన్ని వెలిగించి ఆ తర్వాత వీలు ఉన్నప్పుడు శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవచ్చు.

TOP STORIES

EPF: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్… వివరాలు ఇవే…!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది జీతం ఉన్న వ్యక్తుల కోసం ప్రభుత్వ యాజమాన్యం తో నడిచే పెన్షన్ ప్లాన్. దీంతో ప్రతి నెల 12...