మనం చాలా పద్ధతుల్ని పాటిస్తూ ఉంటాము. మంగళవారం నాడు, శుక్రవారం నాడు డబ్బులు ఎవరికి ఇవ్వకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలాంటివి కూడా మనం ఫాలో అవుతూ ఉంటాము. కానీ, ఒక్కోసారి మర్చిపోయి ఇచ్చేస్తూ ఉంటాము. అసలు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదా..? ఇస్తే ఏమవుతుంది అనే ముఖ్య విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరే ఏం చేయడానికి అయినా సరే వెనుకాడడం లేదు. హిందువులు మాత్రం డబ్బు అంటే లక్ష్మీదేవితో సమానమని భావిస్తారు. అందుకని డబ్బును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు.
పొరపాటున కిందపడిన కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు. ఇలా డబ్బుకి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తాము. మంగళవారం, శుక్రవారం అస్సలు ఎవరికీ డబ్బులు కూడా ఇవ్వం. మంగళవారానికి కుజ గ్రహం అధిపతి. ఆయన యుద్ధకారుడు. ఆరోజు ఎవరికైనా డబ్బు ఇస్తే వెనక్కి రాదని.. ఆర్థిక ఇబ్బందులు వస్తాయని అంటారు. ఇదే సూత్రాన్ని శుక్రవారం నాడు కూడా చాలామంది పాటిస్తారు.
శుక్రవారం అంటే లక్ష్మీదేవికి పూజ చేసే రోజు. అందుకని లక్ష్మీవారం అని కూడా అంటారు. అలాంటి రోజున ఎవరికైనా అప్పు ఇస్తే అది మళ్ళీ వెనక్కి రాదని భావిస్తారు. అందుకని ఈ కారణం వలన మంగళవారం శుక్రవారం డబ్బులు ఎవరికి ఇవ్వరు. మంగళవారం, శుక్రవారం మాత్రమే కాదు సాయంత్రం అయ్యాక అంటే సూర్యాస్తమయం తర్వాత కూడా ఎవరికీ అప్పులు ఇవ్వరు. సూర్యాస్తమయం అయ్యాక ఎవరికి అప్పు ఇవ్వకూడదు. దీని గురించి శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. అందుకని ఈ నియమాన్ని కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు.