గత కొన్నిరోజులుగా బల్దియా అధికారులు, ఉద్యోగులు కరోనా భారిన పడుతున్నారు. ఇప్పటికి 15 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి బల్దియా కమిషనర్ కోవిడ్ టెస్టు చేయించుకోగా వారిలోనూ స్వల్పంగా కోవిడ్ లక్షణాలు బయట పడ్డాయి. కనుక వెంటనే వారు హోం ఐసోలేషన్లోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడిప్పుడే పలువురు అధికారులు కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు.